Terrorist Attack: ఉగ్రదాడులు.. 30 మంది మృతి

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు జరిగాయి. ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన దాడిలో మొత్తం 30 మంది మృతి చెందారు. వీళ్లలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 12 మంది ఉగ్రవాదులు చనిపోయారు.

New Update
Terrorist attack

Terrorist attack

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు జరిగాయి. ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. ఈ భీకర దాడిలో మొత్తం 30 మంది మృతి చెందారు. వీళ్లలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. 12 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. కలాట్‌ జిల్లాలోని మంగోచార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు యత్నించారు. దీంతో భద్రతా సిబ్బందితో వాళ్లకు ఘర్షణ చోటుచేసుకుంది. 

Also Read: బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?

జనవరి 31 -  ఫిబ్రవరి 1 మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌లో 18 మంది సైనికులను కోల్పోయినట్లు పాకిస్థాన్ తెలిపింది. ఉగ్రవాదుల ప్రయత్నాలను పిరికిపంద చర్య అంటూ విమర్శలు చేసింది. బలూచిస్థాన్‌లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఉగ్ర కుట్రలను తిప్పికొట్టామని.. 12 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టామని ప్రకటించింది. అలాగే 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.     

Also Read: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

ఈ ఘటనకు పాల్పడ్డవారిని చట్టు ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. మరోవైపు ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ ఖండించారు. ఇదిలాఉండగా.. పాకిస్థాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన బలూచిస్తాన్‌ గత కొన్నేళ్లనుంచి ఉగ్రదాడులతో అట్టుడుకుతోంది. అయితే ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) విముక్తి ఉద్యమాన్ని మొదలుపెట్టింది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బలుచిస్తాన్‌లోని పలువురు ముష్కరులు పాకిస్థాన్ సైన్యం, పోలీసులపై దాడులు చేయడం సాధారణంగా మారిపోయింది.  

Also Read: 2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Also Read: ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

Advertisment
తాజా కథనాలు