Mexico Bar Shooting: మెక్సికోలోని ఓ బార్లో కాల్పులు..ఆరుగురు మృతి!!
మెక్సికోలోని ఓ బార్లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP శనివారం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బార్లో జనం గుమిగూడిన సమయంలో కాల్పులు జరిగినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది.