WHO: ప్రతీ గంటకూ 30 మంది మృతి..డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ రిపోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా నీటిలో మునిగి గంటకు 320 మంది చనిపోతున్నారని డబ్ల్యూహోచ్‌వో చెబుతోంది. దీనిపై తాజాగా విడుదల చేసిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇలా నీటిలో మునిగిపోయి ఎక్కువగా చనిపోతున్న వారిలో ఇండియా మూడవ స్థానంలో ఉంది. By Manogna alamuru 16 Dec 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆదాయం తక్కువ ఉన్న దేశాల్లో నీటిలో మునిగి చనిపోతున్నవారి సంఖ్య అధికంగా ఉందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. డబ్ల్యూహెచ్‌వో నీట మునిగి చనిపోయిన మరణాలు, వాటి నివారణపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నీట మునగడం వల్ల సంభవించే మరణాల రేటులో 38% శాతం తగ్గింది. కానీ ఇంకా కొన్ని దేశాల్లో ఈ ప్రమాదం ఎక్కువగానే ఉందని డబ్ల్యూహోచ్‌వో తెలిపింది. ప్రతీ గంటకు సగటున 30 మంది నీటిలో మునిగి చనిపోతున్నారని చెప్పింది. మునిగి చనిపోవడాన్ని ప్రజారోగ్య సంక్షోభం అని నివేదిక పేర్కొంది. 2021లోనే మూడు లక్షల మంది నీట మునిగి మరణించగా.. అందులో దాదాపు 1.5 లక్షల మంది 29 ఏళ్ల లోపు వారున్నారు. ఇప్పుడు 2024లో కూడ ఇదే సంఖ్య దాదాపు కనిపిస్తోంది. ఈ గణాంకాలు ఇలాగే కొనసాగితే.. 2050 సంవత్సరం నాటికి అంటే రాబోయే 25 సంవత్సరాలలో 72 లక్షల మందికి పైగా నీట మునిగి మృతి చెంద అవకాశం ఉందని డబ్ల్యూహోచ్‌వో చెబుతోంది. భారత్ మూడో స్థానంలో.. నీటిలో మునిగి చనిపోతున్న వారి విషయంలో భారతదేశం గణాంకాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి 38,000 నుంచి 39,000 మంది ఈ కారణంగా మరణిస్తున్నారు. వీరిలో దాదాపు 31,000 మంది పురుషులు, 8,000 మంది మహిళలు ఉన్నారు. మునిగిపోవడం వల్ల సంభవించే మరణాలు ప్రపంచంలోనే ఇండియా మూడవ అత్యధికంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్ (2012) ప్రకారం.. భారతదేశంలో ప్రతిరోజూ 80 మంది ప్రజలు మునిగిపోవడం వల్ల మరణిస్తున్నారు. 2013లో నీటిలో మునిగి 29,456 మంది, మలేరియా కారణంగా 440 మంది మరణించారు. కేరళలో, మొత్తం అసహజ మరణాలలో 14.3% మునిగిపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. టోటల్‌గా అసహజ మరణాలు భారతదేశంలో 7.4%గా ఉంది. Also Read: TS: వివాదంలో భద్రాచలం లడ్డూ.. అలా ఎందుకు చేశారు? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి