Uttara Pradesh: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం..

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్‌ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌లో పోర్న్ చూస్తున్నారని విద్యార్ధులను దండించటానికి వచ్చిన ప్రిన్సిపల్‌ను తిరిగి ఆ విద్యార్ధులే చితక్కొట్టిన సంఘటన వైరల్ అయింది.

New Update
Uttara Pradesh: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం..

Students Beated Principal: ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్‌ కాలేజీలో కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పోర్న్ చూస్తున్నారు. అటుగా వెళుతున్న ప్రిన్సిపల్ దీనిని గమనించారు. దీంతో ఆ విద్యార్థులను ప్రిన్సిపల్‌ మందలించారు. దీనిని మనసులో పెట్టుకున్న వారు సెలవుల తర్వాత దారిలో చుట్టుముట్టి ప్రిన్సిపల్‌ ను చితక బాది.. డబ్బులు కూడా లాక్కెళ్లారు. బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..

కాలేజీలో ఏడో పీరియడ్‌ సమయంలో క్లాస్‌లోని కొందరు విద్యార్థులు ఇతర బాలికలతో కలిసి ఓ గదిలో కూర్చుని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించి.. మొబైల్ లాక్కోవడంతో పాటు ఎనిమిదో పీరియడ్‌లో మళ్లీ అలా చేయవద్దని సూచించారు. మొబైల్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే క్లాస్‌ ముగించుకుని ప్రిన్సిపాల్‌ బైక్‌పై ఇంటికి వస్తుండగా ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టి కొట్టాడు. అంతే కాదు ఆ విద్యార్థి తనను తుపాకీతో బెదిరించి జేబులోంచి రూ.2200 తీసుకున్నాడని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గట్టిగా అరవడంతో స్థానికులు వస్తారని బయపడి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.

Also Read:Andhra Pradesh: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారు గానీ..కానీ ఏం జరగలేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు