Lay Offs : 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి... 26 వేల మంది ఉద్యోగులు ఔట్! ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. By Bhavana 20 Apr 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Employees Out : కరోనా(Corona) తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగం(IT Sector) లో తీవ్ర ఆర్థిక సంక్షోభం(Financial Crisis) ఏర్పడింది. చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఉద్యోగులను కంపెనీల నుంచి తొలగిస్తూండడంతో కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గుతుంది. దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ ఈ ఏడాది రెండో సారి వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దిగ్గజ కంపెనీలన్ని ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్(AI) రాకతో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని చెప్పొచ్చు. దీంతో కంపెనీల నిర్వహణ చాలా భారంగా మారింది. వాటిని తగ్గిచుకోవడం కోసం కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. ఇందులో కంపెనీ తొలగించిన వారితో పాటు.. వారంతట వారే వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇన్ఫోసిస్లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది ఐదో త్రైమాసికం అంటున్నారు. 2001 తర్వాత కంపెనీలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులు తగ్గి పోవడం ఇదే తొలిసారి అని.. తాజాగా ఫలితాల ప్రకటన సందర్బంగా ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో మొత్తం ఎంప్లాయిస్ 3,17,240 మంది ఉన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. ఇది 7.5 శాతం వరకు తగ్గింది. ఇక త్రైమాసిక పరంగా చూస్తే.. క్రితం త్రైమాసికంలో అనగా జనవరి-మార్చి వరకు ఇన్ఫోసిస్ నుంచి 5,423 మంది వెళ్లిపోయారు. ఇన్ఫోసిస్(Infosys) సంస్థ గురువారం అనగా ఏప్రిల్ 18 నాడు క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. భారీగా లాభాలు నమోదు చేసింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే.. 30 శాతం వృద్ధి సాధించి రూ.7,969 కోట్లకు చేరింది. Also read: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ హెచ్చరికలు! #it-sector #infosys #layoffs #corona సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి