IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు
ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. అయితే రాబోయే ఆరునెలల్లో కూడా ఐటీ ఉద్యోగం వెతుక్కునే వారికి మరింత గడ్డుకాలం ఉండనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు పలు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది.