Indrasena Reddy: కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తోంది.. ఇంద్రసేనారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు పరేడ్‌ గ్రౌండ్‌లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Indrasena Reddy: నేను గవర్నర్ కావడం తెలంగాణ బీజేపీకి బూస్ట్: ఇంద్రసేనారెడ్డి
New Update

కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్ల ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లి పార్టీ అఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ నేతలు పరేడ్‌ గ్రౌండ్‌లో సీబ్ల్యూసీ సమావేశం నిర్వహించుకోవడం కోసం కేంద్రాన్ని కోరినట్లు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు పరేడ్‌ గ్రౌండ్‌ కోసం రాసిన లెటర్‌ను బయట పెట్టాలని ఆయన సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పరేడ్‌ గ్రౌండ్‌ అనుమతి కోసం లేఖ రాయలేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిపై ఇంద్రసేనా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ఓ పెద్ద దొంగ అన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్సీ కవితకు ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ఏమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్‌తో బిజినెస్‌ సంబంధాలు ఉన్నాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది ప్రజలకు తెలిసి పోయిందన్నారు. మూడు నెలల తర్వాత బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..కేసీఆర్‌ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలదని దేశాన్ని ఆగం చేయడానికి వస్తున్నారా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా నష్టపోయారో వారికి అర్దమైందన్నారు. రాష్ట్ర ప్రజలు ఇక కేసీఆర్‌ మాటలు నమ్మె పరిస్థితి లేదని, అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలంగా మారిందని ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.

 

#brs #congress #revanth-reddy #mlc-kavitha #cm-kcr #indrasena-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe