మాల్దీవులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. చాలామంది టూరిస్టులు ఇక్కడి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం వెంటనే మాల్దీదువులను వీడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికోసం భారత్‌తో చర్చలు ప్రారంభించామని తెలిపారు. వాస్తవానికి మాల్దీవుల్లో ఇండియన్ ఆర్మీ ఉనికికి వ్యతిరేకంగా మొహమ్మద్ మయిజ్జు పార్టీ ప్రచారం చేసి గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ఈ విషయంపై మాట్లాడారు. తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనా? ఆసక్తి రేపుతున్న అమిత్ షా ప్రకటన..!
భారత్‌తో జరుగుతున్న చర్చలు విజయవంతమయ్యాయని.. పరస్పర ప్రయోజకరమైన ద్వైపాక్షిక సంబంధాలనే తాము కోరుకుంటున్నామని మొహమ్మద్ మయిజ్జు అన్నారు. ఇండియన్ ఆర్మీ స్థానంలో చైనా లేదా ఇతర దళాలు కూడా ఉండవని చెప్పారు.ఇదిలా ఉండగా.. హిందూ మహాసముద్రంపై పెత్తనం కోసం భారత్, చైనాల మధ్య తీవ్రంగా పోటీ ఉంది. దీంతో ఇక్కడ కీలకంగా ఉన్న మాల్దీవులలో ఇరు దేశాలు కూడా పోటాపోటీగా పెట్టుబడులు పెట్టడంతో సహా ఆ దేశ అభివృద్ధికి భారీగా రుణాలు అందిస్తున్నాయి. ఇంతకుముందు మాల్దీవులకు అధ్యక్షునిగా ఉన్న ఇబ్రహీం సోలిబ్ ఓటమి పాలయ్యారు. అయితే ఈయన భారత్‌కు అనుకూలంగా వ్యవహించారు. ప్రస్తుతం దాదాపు 70 మంది భారతీయ సైనికిలు మాల్దీవుల్లో ఉన్నారు. భారత్ ఏర్పాటు చేసినటువంటి రాడార్ స్టేషన్లు, మోహరించిన నిఘా విమానాలను వారు నిర్వహిస్తున్నారు. అంతేకాదు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో పెట్రోలింగ్ కోసం భారత యుద్ధ నౌకలు కూడా సహకరిస్తున్నాయి.