USA: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన

అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్‌ ల్యాండ్‌లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.

హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!
New Update

Indian Student Killed in US: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. ఓహియో రాష్ట్రంలోని క్వీన్‌ ల్యాండ్‌లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారత విద్యార్థి మరణించడం బాధాకరమని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. ఉమా సత్యసాయి (Uma SatyaSai) మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే అతని మరణానికి గల కారణాలను ఎంబసీ వెల్లడించలేదు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడో కూడా చెప్పలేదు. అయితే ఈ ఏడాది అమెరికాలో (US) మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.

Also Read: అలా చేస్తే కచ్చతీవు ఇచ్చేస్తాం.. భారత్‌కు శ్రీలంక షరతు

గత నెలలో కూడా కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే శాస్త్రీయ నృత్యకారుడిని కూడా మిస్సౌరిలోని సెయింట్‌లూయిస్‌లో కాల్చి చంపేశారు. అలాగే అదే నెలలో బోస్టన్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఏపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి కూడా హత్యకు గురయ్యాడు. ఇలా వరుసగా విద్యార్థులు మృతి చెందడంతో.. భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇందుకోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం.. వివిధ ప్రాంతాల్లో కాన్సులేట్ల అధికారులు, భారతీయ విద్యార్థులతో వర్చువల్‌గా ఇంటరాక్షన్ నిర్వహించింది. ఇందులో భారత విద్యార్థుల రక్షణకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిపారు.

Also Read: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారు : ఉత్తమ్

#indian-student #us #indian-embassy #national-news #telugu-news #america
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe