USA: అమెరికాలో తండ్రి చనిపోయినట్లు నాటకమాడాడు.. చివరికి

అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
USA: అమెరికాలో తండ్రి చనిపోయినట్లు నాటకమాడాడు.. చివరికి

అమెరికాలో ఓ విద్యార్థి స్కాలర్‌షిప్‌ కోసం తండ్రి చనిపోయిట్లు నాటకమాడాడు. చివరికి ఇది బయటపడంతో అతడిని అధికారులు బహిష్కరించారు. మరికొన్ని రోజుల్లో అతడు ఇండియాకు రానున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన ఆర్యన్ ఆనంద్‌ అనే విద్యార్థి 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ లేహీలో ప్రవేశం పొందాడు. దీంతో అతడు స్కాలర్‌షిప్‌ కోసం తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. తన తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఇలా ఏడాది గడిచిపోయింది.

Also Read: హోరాహోరీగా ట్రంప్ – బైడెన్ మధ్య డిబేట్

ఇటీవల అసత్యాలతోనే నా జీవితాన్ని నిర్మించుకున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన పదో తరగతి బోర్డు ఫలితాలను తారుమారు చేసిన తీరు.. తప్పుడు డాక్యుమెంట్స్‌తో అమెరికాలో ఎలా చదివానని చెప్పాడు. చదువుపై ఆసక్తి లేకపోవడం, స్కాలర్‌షిప్‌ కోసం పరీక్షల్లో మోసానికి పాల్పడటం అలాగే తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల గురించి వివరించాడు. అయితే ఈ విషయం అక్కడి అధికారులకు తెలిసింది. దీంతో జూన్ 12న ఆర్యన్‌ ఆనంద్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ కేసులో అతడికి 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే ఛాన్స్ ఉంది. కానీ యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిపై బహిష్కరణ వేటు పడింది. మరికొన్ని రోజుల్లోనే అతడు ఇండియాకు తిరిగిరానున్నట్లు తెలుస్తోంది.

Also read: రాజుల కోసం కాదు, రాణుల కోసం కట్టిన ప్యాలెస్!

Advertisment
తాజా కథనాలు