Telangana: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తిపోట్లు.. వైద్యులు ఏం చెప్పారంటే

అమెరికాలో ఇటీవల ఓ దుండగుడు దాడిలో కత్తిపోట్లకు గురైన తెలంగాణ విద్యార్థి వరుణ్‌రాజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరుణ్‌కు తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Telangana: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తిపోట్లు.. వైద్యులు ఏం చెప్పారంటే
New Update

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్‌రాజ్ ఆదివారం కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వాల్పరైసో యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వరణ్‌రాజ్ ఆదివారం పబ్లిక్ జిమ్ నుంచి తిరిగివస్తుండగా.. జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తి వరుణ్‌ను కత్తితో కణతో పొడిచాడు. దీంతో వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం లూథరన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌రాజ్‌ ఇంకా కోమాలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అతనికి లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వరుణ్‌కు తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వరుణ్‌రాజ్‌ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) విరాళాల సేకరణ ప్రారంభించింది. బుధవారం రాత్రి వరకు దాదాపు 38 వేల డాలర్లు సమకూరినట్లు తెలుస్తోంది.

Also Read: సర్వం సిద్ధం.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Also Read: గూగుల్‌లో కేసీఆర్, రేవంత్ పేర్లతో జోరుగా సెర్చింగ్.. ఈ ప్రశ్నలే ట్రెండింగ్!

ఇదిలా ఉండగా వరుణ్‌రాజ్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడి వెనకున్న ఉద్దేశ్యం ఏంటి, జాతీ వివక్షతో దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

#telugu-news #telangana-news #attack-in-usa #usa-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe