Latest News In Telugu Nuclear Bomb: వామ్మో.. హిరోషిమా కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీకి ఆ దేశం సిద్ధం.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ప్రపంచంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణుబాంబును తయారుచేయడం అనివార్యమవుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనివల్ల తమ దేశంతో సవాలు చేయాలనుకునేవారికి కష్టతరమవుతుందని పేర్కొంది. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Crime News: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు అమెరికాలోని లెవిస్టన్ పట్టణంలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితుడు రాబర్ట్ కార్డ్ మృతి చెందాడు. ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒకరి మృత దేహాన్ని స్థానికులు గుర్తించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్డ్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మృతి చెందాడని తెలిపారు. అయితే రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చి చంపారా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఢీకొన్న 158 కార్లు.. అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. కార్చిచ్చుల పొగ, అలాగే సాధారణ పొగమంచు కలిసి వాతావరణ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn