USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి యూఎస్‌లోని జార్జియాలో 25ఏళ్ళ ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. తాను సహాయం చేసి తిండి పెట్టిన హోమ్‌లెస్ మ్యేనే అతన్ని సుత్తితో దారుణంగా బాదిమరీ చంపేశాడు. జనవరి 16నజరిగి5న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 29 Jan 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Indian student Murdered in USA:భారత్ నుంచి చదువుకోవడానికి యూఎస్ వెళ్ళాడు వివేక్ సయిని. ఇతని వయసు 25 ఏళ్ళు. జార్జియాలోని యూనివర్శిటీలో చదువుతున్నాడు. దాంతో పాటూ ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో కూడా పని చేస్తున్నాడు. యూఎస్‌లో చుదువుకోవడానికి వెళ్ళిన భారతీయులు చాలా మంది ఇలాగే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ కాలేజీలకు హాజరయి...సాయంత్రాలు పని చేసి సంపాదించుకుంటారు. వివేక్ కూడా ఇదే చేస్తున్నాడు. చదువుతో పాటూ వివేక్‌కు కాస్తంత మంచి మనసు కూడా ఉంది. అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. Also Read:PM Modi:అవి విజిటింగ్ కార్డులు కాదు, చూపించడం మానేయండి..పరీక్షా పే చర్చాలో ప్రధాని మోడీ సహాయం చేస్తే ప్రాణాలు తీశాడు... వివేక్ పని చేస్తున్న స్టోర్ దగ్గరకు ఫాల్కనర్ అనే హోమ్ లెస్ మ్యాన్ వచ్చాడు. బాగా చలిగా ఉండడంతో అతనిని స్టోర్‌లోకి రానిచ్చాడు వివేక్ సైనీ. దాంతో పాటూ తినడానికి, తాగడానికి కూడా ఇచ్చాడు. దుప్పటి అడిగితే స్టోర్‌లో లేక ఇవ్వలేకపోయాడు. ఇలాచాలా రోజుల నుంచీ అతనికి సహాయం చేస్తున్నాడు వివేక్. అయితే మర్డర్ జరిగిన రోజు స్టోర్ మూసే టైమ్ అవవ్వండతో వివేక్ ఫాల్కనర్‌ను స్టోర్ నుంచి బయటకు వెళ్ళమన్నాడు. కానీ అతను వెళ్ళలేదు. చాలా సేపు మొరాయించాడు. వివేక్ అతనిని బలవంతంగా బయటకు పంపించాలని చూశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పాల్కనర్ సైనీని సుత్తితో బలంగా కొట్టాడు. ఇలా ఒక్కసారి కాదు...చాలా సార్లు తల మీద కొట్టాడు. మొత్తం 50 సార్లు బాదాడని చూసినవాళ్ళు చెబుతున్నారు. దీంతో వివేక్ సైనీ అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న మరికొంత మంది పోలీసులకు కంప్లైంట్స్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఫాల్కనర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు పారిపోకుండా స్టోర్లో ఉన్నవాళ్ళు పట్టుకోవడంతో పోలీసులకు అతనిని అరెస్ట్ చేయడం ఈజీ అయింది. పోలీసులు వెళ్ళే సమయానికి ఫాల్కనర్ వివేక్‌ను బాదిన సుత్తిని చేతిలోనే పట్టుకుని ఉన్నాడు. అంతేకాదు అతని దగ్గర మరొక సుత్తి, రెండు కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫాల్కనర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #murder #usa #indian-student #home-less-man మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి