Stock Market News: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఎన్నడూ లేనంతగా నిన్నటి వరకూ భారీగా దూసుకెళుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ వరుసగా 2 సెషన్లలో దాదాపు 2 వేల పాయింట్ల వరకు పెరగడం విశేషం. శుక్రవారం సెషన్‌లో సెన్సెక్స్ ఏకంగా 970 పాయింట్లు పెరిగి 71,484 పాయింట్ల వద్ద సెషన్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (NSE) సూచీ నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 21 వేల 457 వద్ద స్థిరపడింది. దీనికి కారణం ఐటీ కంపెనీల స్టాక్స్ భారీగా పెరగడమే. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా HCL టెక్నాలజీస్, విప్రో ఇలా అన్ని షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. దీంతో మార్కెట్లలో మంచి కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
Also Read: మాకు నిప్పు పెట్టుకుందాం అనుకున్నాం..పార్లమెంటు దాడి ప్రధాన నిందితుడు లలిత్ ఝా
ఐటీ స్టాక్స్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడ్ రేట్లలో (Fed Rates) మార్పు లేదని చెప్పడమే అంటున్నారు నిపుణులు. అంతకు ముందు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చింది ఫెడ్.కానీ లాస్ట్ త్రీ టైమ్ గా మాత్రం రేట్లను యధాతథంగానే ఉంచేసింది.మరోవైపు 2024 సంవత్సరంలో ఏకంగా 3 సార్లు వడ్డీ రేట్లు (Interest Rates) తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది.మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే బాటలో వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రోత్ స్టాక్స్ రానున్న రోజుల్లో పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.
ఇక మార్కెట్ (Stock Market) ఆల్ టైమ్ హై చేరడం వల్ల కొత్త ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతారేమో కానీ పాతవాళ్ళు మాత్రం అంతగా కంగారు పడరని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్ లను అంతగా అమ్మకపోవచ్చని చెబుతున్నారు. ఐటీ స్టాక్స్ పెరిగినా మంచి కంపెనీ స్టాక్ లు అమ్మేయకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు. దాన బదులుగా ప్టాక్ లు పడిన ప్రతీసారి ఎస్ఐపీ విధానంలో కొంతమేర కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఐటీస్టాక్ లు భారీగా ర్యాలీ అవుతుండడంతో ఇండెక్స్ కూడా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో మార్కెట్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.