Ishan Kishan:స్ట్రగుల్లో ఇషాన్ కిషన్ కెరీర్.. ఏ స్పష్టత లేదంటున్న బోర్డ్ ఇషాన్ తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడనే వార్తలపై ఝార్ఖండ్ క్రికెట్ సంఘం స్పందించింది. 'ఇషాన్ విషయంలో మాకు ఎలాంటి స్పష్టత లేదు. అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని మాకు చెప్పలేదు. ఎప్పుడు వచ్చినా సరే తుది జట్టులో అవకాశం ఇస్తాం'అని బోర్డ్ తెలిపింది. By srinivas 12 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ishan Kishan: భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ సిరీస్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను మాత్రం భారత కోచ్ రాహుల్ ద్రావిడ్ (Dravid) కొట్టిపారేశాడు. అయినా ఇషాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. కానీ దేశవాళీ క్రికెట్ ఆడి రావాలని సూచించినట్లు తెలుస్తుండగా దీనిపై తాజాగా ఝార్ఖండ్ క్రికెట్ సంఘం సభ్యుడు మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఝార్ఖండ్ క్రికెట్ సంఘం.. ఈ మేరకు 'ఇషాన్ తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంపై ఝార్ఖండ్ క్రికెట్ సంఘం ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు. ఇషాన్ విషయంలో మాకు ఎలాంటి స్పష్టత లేదు. అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని మాకు చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా సరే డైరెక్ట్ తుది జట్టులో ఆడించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆ సంఘం కార్యదర్శి దేబశిశ్ చక్రవర్తి వెల్లడించాడు. ఇది కూడా చదవండి : INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్ బీసీసీఐ ఆగ్రహం.. ఇక ‘మానసిక అలసట’ కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్ దుబాయ్ పార్టీలకు వెళ్లడంతోనే బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందనే తెలుస్తుండగా.. ఇప్పుడు రంజీల్లో ఆడకపోతే ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇషాన్ స్థానంలో..అంజిక్య రహానె, శ్రేయాస్ అయ్యార్ లను ఆడించే అవకాశం కనిపిస్తోంది. సౌరాష్ట్ర తరఫున ఝార్ఖండ్‌పై డబుల్ సెంచరీ సాధించిన పుజారాకూడా లైన్ లో ఉన్నట్లు తెలస్తోంది. #jharkhand #ishan-kishan #ranji-trophy #cricket-board మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి