Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు

భారత జాతీయ క్రీడ హాకీ.మొదట్లో అంటే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం..తిరుగులేని విజయాలతో ఇండియా టీమ్ చరిత్ర సృష్టించింది.కానీ దీనికి మధ్యలో 52 ఏళ్ళు గ్యాప్ వచ్చింది.ఇప్పుడు మళ్ళీ ఆ వైభవం తిరిగి వచ్చినట్టు కనబడుతోంది.భారత హాకీ జట్టు వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది.

Hockey: భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం..52 ఏళ్ళ తర్వాత రెండుసార్లు కంచు
New Update

Indian Hockey Team Won Two Olympics Medals In a Row:  భారత హాకీకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. మన ప్లేయర్లు అద్భుతంగా ఆడడమే కాకుండా మెడల్స్ కూడా సాదిస్తున్నారు. లాస్ట్ టైమ్ టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యం గెలుచుకున్న టీమ్ ఇండియా ఈసారి ఇంకా బాగా ఆడింది. నిజానికి ఈసారి కనీసం రజతం అయినా వస్తుంది అనుకున్నారు కానీ తృటిలో అది చేజారిపోయింది. అయితే భారత హాకీ ప్లేయర్లు కాంస్యాన్ని మాత్రం చేజార్చుకోలేదు. తమ అద్భుత ఆట తీరుతో పతకాన్నిదక్కించుకుంది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ (Hockey Team) అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు మనోయిర్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ మొటినుంచి రసవత్తరంగా సాగింది. మొదటి సెషన్ లోనే భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచి తిరుగులేని ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది.

ఇలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు పతకాలు సాధించడం 52 ఏళ్ళ తర్వాత ఇప్పుడే జరుగతోంది. ఒలింపిక్స్ మొదలైన తర్వాత 1928 అమ్‌స్టర్‌డమ్‌ లో మొదటిసారి స్వర్ణం సాధించింది భారత హాకీ జట్టు. అప్పటి నుంచి వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది భారత జట్టు. లాస్ఏంజెల్స్‌ (1932), బెర్లిన్ (1936), లండన్ (1948), హీల్‌సింకీ (1952), మెల్‌బోర్న్‌ (1956) విశ్వక్రీడల్లో బంగారు పతకాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. తర్వాత రోమ్‌ (1960)లో సిల్వర్, టోక్యో (1964)లో మళ్లీ గోల్డ్ సాధించింది. మెక్సికో సిటీ (1968), మ్యూనిక్‌ (1972)లోనూ కాంస్యంతో సరిపెట్టుకుంది. చివరిసారిగా మాస్కో (1980) ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన భారత జట్టు..ఆ తర్వాత ఒక్క పతకం కూడా కొట్టలేకపోయింది.

ఆ తర్వాత నెమ్మదిగా భారతదేశంలో హాకీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. పేరుకే హాకీ భారత క్రీడ అన్నట్టు తయారయింది. తర్వాత క్రికెట్ దేశంలో ఎక్కువై పోవడంతో హాకీ పూర్తిగా కనుమరుగైపోయింది. భారత హాకీ జట్టు ఉంటున్నా..ఎక్కడా ఏ టోర్నమెంటులోనూ చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం లేకుండా పోయాయి. మధ్యలో షారూఖ్ ఖాన్ చెక్‌ దే ఇండియా అంటూ సినిమా తీశాడు కానీ...అది ఏమంత ఉపయోగం లేకుండా పోయింది. సినిమా అయితే హిట్ అయింది కానీ హాకీ ఆట మాత్రం హిట్ అవ్వలేదు. తిరిగి మళ్ళీ 2020 టోక్యో ఒలిపింక్స్‌లో భారత్ పేరు వినిపించింది. ఆ ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా మరికొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో పతకాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు పారిస్ ఒలిపింక్స్‌లో మొదటి నుంచి అద్భుత ఆట తీరును కనబర్చారు మన ఆటగాళ్ళు. రజతం లేదా స్వర్ణం గ్యారంటీ అనుకున్నారు కానీ..సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో 11 కు బదులు పదిమంది ఆటగాళ్ళే ఆడడం..చిరి నిమిషంలో జర్మనీ గోల్ కొట్టడంతో ఫైనల్స్‌కు దూరమ్యారు. దాంతో ఆ రెండు పతకాలు చేజారిపోయాయి. కానీ ఆ కసిని ఈరజు జరిగిన స్పెయిన్ మ్యాచ్‌లో తీర్చుకున్నారు భారత హాకీ ప్లేయర్లు. మంచి ఆటతో కాంస్యాన్ని దక్కించుకున్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే భారత జాతీయ క్రీడకు పూర్వ వైభవం తప్పకుండా తిరిగి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: Movies: హార్ట్ బ్రేక్ అయిందంటూ సమంత పోస్ట్..దాని గురించి మాత్రం కాదు

#olympics #indian-hockey-team #medals #national-game
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe