Indian govt ordered assassination of 20 individuals: భారతదేశం మీద పాకిస్తాన్ ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉంటుంది. రైవలరీని పెంపొందించడానికే చూస్తుంటుంది. తాజాగా పాకిస్తాన్ మరో కొత్త వివాదానికి తెర లేపింది. ఉగ్రవాద నిర్మూలన ముసుగులో భార ప్రభుత్వం 20 మంది పాకిస్తానీ అమాయకులను చంపించిందని ఆరోపిస్తోంది. ఈ మేరకు గార్డియన్‌లో రిపోరట్ కూడా ఉంది. దీని ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని RAW యొక్క స్లీపర్ సెల్స్ ఈ హత్యలను నిర్వహించాయని చెబుతోంది. 2019లో జరిగిన పుల్వామా దాడితో ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది పారామిలటరీ సిబ్బంది మృతి చెందడమే దీనికి కారణం అని అంటోంది. స్వయంగా భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తోంది.
స్థానిక నేరస్థులు, అమాయక పాకిస్తానీలను చంపించేందుకు భారత ఏజెన్సీ లక్సల రూపాయలను కూడా ఖర్చు పెట్టిందని అంటోంది పాకిస్తాన్. దీని కోసం జీహాదీలను కూడా రిక్రూట్ చేసుకున్నారని చెబుతోంది. ఇజ్రాయెల్ తాలూకా మోసాద్, రష్యాలోని కేజీబీ ఏజెన్సీల దగ్గర నుంచి మనుషులను రిక్రూట్ చేసుకున్నారని అంటోంది.
అన్నీ అబద్ధాలే...
అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండిస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ గార్డియన్ పత్రిక మీద దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ మండిపడింది. అలా టార్గెట్ పెట్టుకుని హత్యలు చేయించడం భారత ప్రభుత్వ విధానం కాదని పేర్కొన్నారు. గతంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి ఆరోపణలను చేపిందని...అప్పుడు కూడా విదేశాంగ మంత్రి ఎన్. జైశంకర్ వాటిని తిప్పికొట్టారని గుర్తు చేస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇండియా వ్యతిరేకులందరూ కలిసి మన దేశం మీద దాడి చేస్తున్నారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కెనడా చేసిన ఆరోపనలను బేస్ చేసుకునే ఇవన్నీ తెర మీదకు వస్తున్నాయని చెబుతున్నారు. కెనడాలో కూడా నిజ్జర్ హత్య కేసులో బారత్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.
Also Read:Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ..కోవిడ్ కంటే దారుణంగా ఉందంటున్న నిపుణులు