Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్‌ బ్యాంక్

భారత ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియాలో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని తెలిపింది. రత్‌లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందని పేర్కొంది.

New Update
Indian Economy : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం : వరల్డ్‌ బ్యాంక్

World Bank : ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 7.5 శాతం మేర ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా(South Asia) లో ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.0 శాతం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో ఆర్థిక వృద్ధి(Indian Economy) పుంజుకుంటోందని తెలిపింది. అలాగే శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో కూడా ఆశించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో రికవరీ కొనసాగుతోందని పేర్కొంది. సౌత్‌ ఏషియా డెవలప్‌మెంట్‌ నివేదికలో ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.

Also Read : దద్దరిల్లుతున్న దండకారణ్యం..నాలుగు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు

ఇక రాబోయే రెండేళ్లలో దక్షిణ ఆసియాలో ఆర్థిక వృద్ధి ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఉంటుందని ఓ నివేదిక విడుదల చేసింది. 2025 నాటికి ఇది 6.1 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ - హమాస్‌(Israel-Hamas) లో యుద్ధం కొనసాగడం వల్ల.. గాజాలో దాదాపు 18.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని వరల్డ్‌ బ్యాంక్ వెల్లడించింది.

2022లో వెస్ట్‌బ్యాంక్, గాజా ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తిలో ఇది 97 శాతానికి సమానమని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి చివరి నాటికి యుద్ధం కారణంగా గాజాలో జరిగిన ఆస్తి నష్టంపై ఒక మధ్యంతర అంచనా నివేదికను సైతం వరల్డ్‌ బ్యాంకు విడుదల చేసింది. ఇదిలాఉండగా.. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్‌ ముష్కరులు మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

Advertisment
తాజా కథనాలు