Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్..

16వ ఏటనే క్రికెట్‌ రంగంలో అడుగుపెట్టిన సచిన్.. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తూ.. యువతలో క్రికెట్‌ ఆటపై క్రేజ్‌ను పెంచేలా చేశారు. కేవలం సచిన్ బ్యాటింగ్‌ కోసమే క్రికెట్‌ చూసేవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. సచిన్‌ ఈరోజుతో 51వ వసంతంలోకి పెట్టారు.

New Update
Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్..

Happy Birthday Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఒకప్పుడు దేశంలో క్రికెట్‌(Cricket) కి అంత ఆధరణ ఉండేది కాదు. కానీ కేవలం 16వ ఏటనే క్రికెట్‌ రంగంలో అడుగుపెట్టిన సచిన్.. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తూ.. యువతలో క్రికెట్‌ ఆటపై క్రేజ్‌ను పెంచేలా చేశారు. కేవలం సచిన్ బ్యాటింగ్‌ కోసమే క్రికెట్‌ చూసేవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన సచిన్‌.. టీమిండియా(Team India) కు అద్భుతమైన విజయాలు అందించారు. ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ పుట్టిన రోజు. ఏప్రిల్ 24వ తేదితో అతడు 51వ వసతంలోకి అడుగుపెట్టాడు.

Also Read: ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?

సచిన్ చేసిన పోరాటం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. అప్పట్లో పలువురు క్రికెట్ విశ్లేషకులు అతడి బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ.. సచిన్ ఏడారిలో తుఫాన్ అంటూ అభివర్ణించారు. సచిన్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్థ సెంచరీలు, సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా, అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

మరోవైపు సంప్రదాయ టెస్టు ఫార్మెట్‌లో కూడా రికార్డులు సొంతం చేసుకున్నాడు సచిన్. టెస్ట్‌ క్రికెట్‌లో కూడా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. ఇక వరల్డ్‌ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా సచిన్‌కు రికార్డులు ఉన్నాయి. 1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, 1997లో విస్టెన్ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్, 2008లో పద్మ విభూషణ్, 2010లో ఐసిసి క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు(ICC Cricketer Of The Year) లను సొంతం చేసుకున్నారు సచిన్. అలాగే 2014లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నకు కూడా సొంతం చేసుకున్నారు మాస్టర్ బ్లాస్టర్.

Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాంగ్!

Advertisment
తాజా కథనాలు