Paris Olympics: మొదటిరోజే అదరగొట్టారు..క్వార్టర్స్‌కు చేరుకున్న విజయవాడ ఆర్చర్

పారిస్ ఒలింపిక్స్ ఇంకా అధికారికంగా మొదలవ్వనే లేదు కానీ మన ఆర్చర్లు మాత్రం శుభారంభాన్ని ఇచ్చారు. క్వాలిఫికేషన్ రౌండ్లో పురుషులు, మహిళల జట్టు రెండూ నాలుగో స్థానం దక్కించుకుని నేరుగా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

New Update
Paris Olympics: మొదటిరోజే అదరగొట్టారు..క్వార్టర్స్‌కు చేరుకున్న విజయవాడ ఆర్చర్

విజయవాడ కుర్రాడితో సహా భారత ఆర్చర్లు పారిస్ ఒలింపింక్స్‌లో మొదటిరోజే అదరగొట్టారు. ఆరంభోత్సవం కంటే ఒక రోజు ముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో భారత ఆర్చర్లు దుమ్ము దులిపారు. టీమ్‌ ఈవెంట్‌లో భాగంగా జరిగిన ఆర్చరీ పోటీల్లో మహిళల జట్టు నాలుగో స్థానం దక్కించుకుని నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో భారత్‌ 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. విజయవాడ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ 681 పాయింట్లు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత రౌండ్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. మరో ఇద్దరు ఆర్చర్లు తరుణ్‌దీప్‌ రాయ్ 674 పాయింట్లతో 14వ స్థానంలో, ప్రవీణ్ జాదవ్ 658 పాయింట్లతో 39వ స్థానంలోనూ ఉన్నారు. దీంతో మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ 1347 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి రౌండ్‌ ఆఫ్‌ 16లోకి ప్రవేశించింది.

మరోవైపు మహిళా ఆర్చర్లు కూడా అదరగొట్టారు. అంకిత భగత్ 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా... భజన్‌ కౌర్‌ 658 పాయింట్లతో 22వ స్థానంలో.. దీపిక కుమారి 658 పాయింట్లతో 23వ స్థానంలో సత్తా చాటారు. దీంతో టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ మహిళల జట్టు 1983 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుని క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టాప్‌లో నిలిచిన ధీరజ్‌, అంకిత భగత్ భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఇందులో కనుక భారత ఆర్చర్లు పతకం సాధిస్తే...ఒలింపిక్స్‌లో మనవాళ్ళు ఆర్చరీలో మొదటిసారి మెడల్ సాధించినవారు అవుతారు.

Also Read:JayaPrakash Narayana: ఏపీలో రాష్ట్రపతి పాలన.. RTVతో మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు