Cricket:మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు..సీరీస్ సమం చేసిన భారత్ అంచనాలకు తగ్గట్టే భారత్ రాణించింది. వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి...భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి టీ20 మ్యాచ్ గెలిచి సీరీస్ ను సొంతం చేసుకుంది టీమ్ ఇండియా. By Manogna alamuru 15 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్. మొదటిది వర్షానికి అర్పణమైంది. రెండో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. దీంతో మూడో మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితి. ఇది గెలవకపోతే సీరీస్ అవతలి జట్టు చేతుల్లోకి వెళిపోతుంది. ఇలాంటి మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ళు మెరుపులు మెరిపించారు. 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 201 పరుగులు చేసింది. కెప్టెన్ , ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో మెరుపు శతకం చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేశాడు. దీని తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా 13.5 క్షవర్లకే కుప్ప కూలిపోయింది. కేవలం 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 17 పరుగులకు 5 వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హెన్‌డ్రిక్స్ (బి) షమ్సీ 60; గిల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 8; తిలక్ (సి) మార్క్‌రమ్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) బ్రీట్‌కే (బి) విలియమ్స్ 100; రింకూ (సి) (సబ్) స్టబ్స్ (బి) బర్జర్ 14; జితేశ్ (హిట్‌వికెట్) (బి) విలియమ్స్ 4; జడేజా (రనౌట్) 4; అర్షదీప్ (నాటౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్‌డ్రిక్స్ (రనౌట్) 8; బ్రీట్‌కే (బి) ముకేశ్ 14; మార్క్‌రమ్ (సి) యశస్వి (బి) జడేజా 25; క్లాసెన్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 5; మిల్లర్ (బి) కుల్దీప్ 35; ఫెరీరా (బి) కుల్దీప్ 12; ఫెలుక్వాయో (సి) అండ్ (బి) జడేజా 0; మహరాజ్ (బి) కుల్దీప్ 1; బర్జర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; విలియమ్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 95. #cricket #india #south-africa #t20-series మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి