Ind vs WI: ఐపీఎల్ తోపుపై వేటు? వెస్టిండీస్‌తో చావోరేవోకు సిద్ధమైన టీమిండియా

India vs Westindies 4th T20: ఇవాళ (ఆగస్టు 12) టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో మార్పులు చేర్పులతో పాండ్యా టీమ్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్‌ అవుతున్న శుభమన్‌ గిల్‌కి రెస్ట్ ఇచ్చి.. ఇషాన్‌ కిషన్‌ని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. అటు బౌలింగ్‌లోనూ అర్షదీప్‌ లేదా ముఖేశ్‌ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకునే అవకాశం ఉంది. భారత్‌ కాలమానం ప్రకారం మ్యాచ్‌ 8గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఫ్లోరిడాలో మ్యాచ్‌ కావడంతో పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం.

Ind vs WI: ఐపీఎల్ తోపుపై వేటు? వెస్టిండీస్‌తో చావోరేవోకు సిద్ధమైన టీమిండియా
New Update

India vs Westindies 4th T20: మొదటి రెండు మ్యాచ్‌లు తుస్సుమన్నారు. మూడో మ్యాచ్‌ డూ ఆర్‌ డైలో రాణించారు. సిరీస్‌ లెక్కను 2-1కి మార్చారు. ఇక తాజాగా నాలుగో టీ20 ఫైట్‌కి సిద్ధమయ్యారు. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇక ప్రతి మ్యాచ్‌ చావోరేవోనే కావడంతో ఇవాళ(ఆగస్టు 12) వెస్టిండీస్‌(WestIndies)పై నాలుగో మ్యాచ్‌లోనూ టీమిండియా(Team India) కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికీ కరీబియన్‌ జట్టుదే పైచేయి కావడంతో రోవ్‌మన్ పావెల్‌ జట్టుతో అమితుమీకి టీమిండియా రెడీ అయ్యింది. మూడో మ్యాచ్‌ ఏదో గెలిచామంటే గెలిచాం కానీ.. మొదటి రెండు టీ20ల్లో చేసిన తప్పులు మాత్రం సరిచేసుకోలేదన్న విమర్శ ఉంది. విండీస్‌ ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో టీమిండియా విజయం సాధించినట్టు పలువురు అభిప్రాయపడుతున్న వేళ నాలుగో ఫైట్‌లో మార్పులు చేర్పులు చేయనుంది భారత్ జట్టు.

గిల్‌కు రెస్ట్?
ఐపీఎల్‌ హీరో శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill)పై ఈ మ్యాచ్‌లో వేటు పడే అవకాశం కనిపిస్తోంది. మొదటి మూడు టీ20లు కలిపి గిల్‌ చేసిన పరుగులు కేవలం 16మాత్రమే. ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌ గడ్డపై ఒక్క మ్యాచ్‌లోనే 126పరుగులు చేసిన గిల్‌.. విండీస్‌ గడ్డపై 8మ్యాచ్‌ల్లో పట్టుమని 100పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో ఈ ఓపెనర్‌కి రెస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. లాస్ట్‌ మ్యాచ్‌లో యశస్విని తీసుకొచ్చి ఇషాన్‌కి రెస్ట్ ఇవ్వగా.. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ తిరిగి తుది జట్టులో చేరే ఛాన్స్‌ ఉంది. అటు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించడంలేదు. సంజూ శాంసన్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్‌. అటు తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ దూకుడు మీద ఉన్నాడు. 39, 51, 49 పరుగులతో మొత్తం 139 పరుగులు చేసిన తిలక్ వర్మ టి20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. ఇవాళ్టి మ్యాచ్‌లోనూ ఈ హైదరాబాద్ చిన్నోడి నుంచి మంచి ఇన్నింగ్స్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

మరోవైపు బౌలింగ్‌లోనూ టీమిండియా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించడంలేదు. ముఖేశ్‌ కుమార్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఉమ్రాన్ మలికా లేదా అవేశ్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అటు బౌలర్‌గా పాండ్యా ఫెయిల్ అవుతున్నాడు. అర్షదీప్‌, ముఖేశ్‌ కూడా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక ఇవాళ జరగనున్న మ్యాచ్‌ ఫ్లోరిడాలో కావడంతో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌కి విశ్రాంతి ఇచ్చే ఛాన్స్‌ కూడా ఉంది.

India Team Prediction: భారత్ తుది జట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదిప్‌ సింగ్, ముఖేష్ కుమార్/ఉమ్రాన్ మాలిక్

WestIndies Team Prediction: వెస్టిండీస్ తుది జట్టు (అంచనా)
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్/రోస్టన్ చేజ్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

Watch Live at www.jiocinema.com

Also Read: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?

#hardik-pandya #ishan-kishan #shubman-gill #india-vs-west-indies #rtvlivetelugu #india-vs-westindies-4th-t20 #india-west-indies-4th-t20 #tilakvarma #jiocinema-live
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe