IND VS SA: ఆదుకున్న రాహుల్‌.. తొలి రోజు భారత్‌ స్కోరు ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు- మొదటి రోజు ముగిసే సమాయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 70 పరుగులతో క్రీజులో రాహుల్‌ ఉన్నాడు. సిరాజ్‌ అతనికి తోడుగా ఉన్నాడు. భారత్‌ బ్యాటర్లలో రోహిత్, గిల్‌ ఘోరంగా ఫెయిల్ అయ్యారు.

IND VS SA: ఆదుకున్న రాహుల్‌.. తొలి రోజు భారత్‌ స్కోరు ఎంతంటే?
New Update

దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే ఒంటరి పోరు చేశాడు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్లే పడ్డాయి. అంటే 31 ఓవర్లు తక్కువగా వేశారు. దీంతో రేపటి రెండో రోజు మ్యాచ్‌ అరగంట ముందే మొదలువనుంది. డే-1 ముగిసే సమాయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 70 పరుగులతో క్రీజులో రాహుల్‌(KL Rahul) ఉన్నాడు. సిరాజ్‌ అతనికి తోడుగా ఉన్నాడు.


టాపార్డర్‌ ఢమాల్:
పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పైకి ఓపెనర్లగా రోహిత్‌ శర్మ(Rohit Sharma), యశస్వీ జైస్వాల్‌ దిగారు. రోహిత్‌ మరోసారి ఫోకస్‌ తప్పాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన రోహిత్ అనవసర షాట్ ఆడాడు. రబాడా బౌలింగ్‌లో బర్గర్‌ క్యాచ్‌కు రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమ్‌ స్కోరు 23 వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన యాశస్వీ బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 37 బంతుల్లో యశస్వీ 17 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెంటనే శుభమన్‌ గిల్‌ ఔట్‌ అయ్యాడు. కేవలం రెండు పరుగులకే బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత భారత్‌ బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీ, అయ్యర్‌ మోశారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత్‌కు షాక్‌ తగిలింది. 50 బంతుల్లో 31 రన్స్ చేసి రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటి 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్‌ కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికీ భారత్‌ 107 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయి ఉంది. ఇక టీమిండియా 150 దాటడమే కూడా కష్టమే అనుకున్నారు.


ఆదుకున్న రాహుల్:
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కీపర్‌ రాహుల్ ఆదుకున్నాడు. అశ్విన్‌ త్వరగా వెనుతిరగగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికీ ఆరు వికెట్లు పడిపోవడంతో రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కపెట్టే బాధ్యత తీసుకున్న ఠాకూర్‌ పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్‌ 47వ ఓవర్‌లో ఏడో వికెట్‌గా వెనుతిరిగాడు. రబాడా వేసిన ఆ ఓవర్‌లో షార్ట్‌ మిడాఫ్‌లో ఎల్గర్‌కు దొరికిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటాడు. ఇక కాసుపు ఓపికగా ఆడిన బుమ్రా మార్కో జెన్సన్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సిరాజ్‌ బ్యాటింగ్‌కు దిగగా.. కాసేపటికి వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5 వికెట్లు తీశాడు.

Also Read: తల పగిలినా.. నొప్పి వేధిస్తోన్నా.. శార్దూల్‌ ఎలా ఆడాడో చూడండి!

WATCH:

#rohit-sharma #cricket #cricket-news #india-vs-south-africa #kl-rahul
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe