India VS Pakistan : అహ్మదాబాద్‌ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..!

అహ్మదాబాద్‌ లో వన్డే ప్రపంచకప్(World Cup) లో భాగంగా, జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ (Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

New Update
India VS Pakistan : అహ్మదాబాద్‌ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..!

India VS Pakistan World Cup Match: క్రికెట్ మ్యాచ్ ప్రియులకు భారతీయ రైల్వే శాఖ మంచి శుభవార్తను అందించింది. అహ్మదాబాద్‌ లో వన్డే ప్రపంచకప్(World Cup 2023) లో భాగంగా జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్(Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

భారత్-పాక్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్, పాక్ తలపడనున్న ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు కొన్ని వేల సంఖ్యల్లో అభిమానులు వస్తారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలాగే విమానాల టికెట్ ధరలు కూడా భారీగా పెరుగుతాయి.. వీటి నుంచి క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించేలా రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

మ్యాచ్ జరిగే రోజున రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Trains)ను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. దీనికి సంబందించిన టికెట్ ధరలు, బుకింగ్స్ వివరాల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అభిమానులు సులభంగా చేరుకునేలా.. వందే భారత్ రైళ్లు మ్యాచ్ జరగబోయే కొన్ని గంటల ముందు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉన్న సబర్మతి, అహ్మదాబాద్‌ (Ahmedabad) స్టేషన్లను చేరుకుంటాయని తెలిపారు. అదేవిధంగా మ్యాచ్ ముగిసిన అనంతరం తిరిగి అక్కడి నుండి ప్రారంభమవుతాయని తెలిపారు.

భారీగా పెరిగే టికెట్ ధరల నుంచి ఊరట కలగడంతో పాటు అభిమానులు ప్రశాంతగా స్టేడియానికి చేరుకునేలా ప్లాన్ చేసారు.

Also Read: India VS Bangladesh: బంగ్లాదేశ్ పై భారత్ విజయం.. ఆసియా క్రీడలు 2023 ఫైనల్స్ లో భారత్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు