Ind vs Aus T20 Series: సీరీస్ క్లీన్ స్వీపే లక్ష్యంగా టీమ్ ఇండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సీరీస్ లో టీమ్ ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధించి 3-0తో క్లీప్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇవాళ గుహావాటిలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది.

Ind vs Aus T20 Series: సీరీస్ క్లీన్ స్వీపే లక్ష్యంగా టీమ్ ఇండియా
New Update

India vs Australia: టీమ్ ఇండియా కుర్రాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. ఆస్ట్రేలియాతో అవుతున్న టీ20 సీరీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్నారు. ఇవాళ మూడో మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. ఇందులో కూడా విజయం సాధించి 3-0తో సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు స్కోరు చేసిన భారత్‌ ఈ మ్యాచ్‌లో కూడా అదే భారీ లక్ష్యంతో ఆడాలని డిసైడ్ అయ్యారు. కానీ ఏ మాత్రం తడబడినా అన్నీ తారుమారు అయిపోతాయి. వరల్డ్ కప్ లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి.

Also Read: 10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా?

టాపార్డర్‌ బ్యాటర్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. యశస్వి (Yashasvi Jaiswal) దూకుడు ఆసీస్‌ను కంగారు పెట్టిస్తోంది. రెండు వరుస అర్ధ సెంచరీలతో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) , ఫస్ట్ ఫిఫ్టీతో రుతురాజ్, డెత్ ఓవర్లలో రింకూ సింగ్ (Rinku Singh) చెలరేగిపోతున్నారు. వీరందరిలో నిరూపించుకోవాల్సింది, సత్తా చాటుకోవాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ ఒక్కడే. మరోవైపు మొదటి రెండు మ్యాచ్ లకు విశ్రాంతిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈరోజు మ్యాచ్ కు వచ్చేస్తున్నాడు. వైస్ కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. అతను కనుక వస్తే తిలక్ వర్మ బెంచ్ కు పరిమితం అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే బౌలర్లు అందరూ నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ప్రసిద్ధకృష్ణ, అర్ష్‌దీప్‌లో పాటూ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ లు రాణిస్తున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా ఏమీ తక్కువగా ఆడడం లేదు. ఆ్రస్టేలియా తొలి టి20లో 200 పైచిలుకు పరుగులు చేసింది. అయితే దానిని మన వాళ్ళు చేధించడంతో ఓడిపోయింది. తర్వాతి మ్యాచ్‌లో మాత్రం 236 భారీ పరుగల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడిపోయింది. అలా అని వాళ్ళను తక్కవు చేయలేము. సడెన్ గా పుంజుకుని మ్యాచ్ గెలిచినా గెలిచేస్తారు. కాబట్టి టీమ్ ఇండియా కాస్త జాగ్రత్తగానే ఆడాలి. అయితే నిలకడ లేని బ్యాటింగ్, నియంత్రణ లేని బౌలింగ్‌ జట్టును కలవరపెడుతోంది. స్మిత్, షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్‌ డేవిడ్, స్టోయినిస్‌లాంటి మేటి బ్యాటర్లున్నప్పటికీ ఈ సిరీస్‌లో గెలుపు దారిలో మాత్రం ఆసీస్‌ పడలేకపోతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే తప్ప పటిష్టమైన ఆతిథ్య జట్టు జోరుకు కళ్లెం వేయలేదు.

#cricket #australia #india-vs-australia #rinku-singh #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe