BCCI: ఇండియా Vs శ్రీలంక.. షెడ్యూల్ ఖరారు!

3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది. వన్డేలకు రోహిత్ శర్మ, టీ20లకు హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నారు.

New Update
BCCI: ఇండియా Vs శ్రీలంక.. షెడ్యూల్ ఖరారు!

India Tour of Sri Lanka: 3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. జూలై 27న ఈ సిరీస్ ప్రారంభమవుతుందని తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో ఒక రోజు సవరించి జూలై 26కి బదులుగా జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది.

అయితే ఈ సీరిస్ ల్లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వం వహించనున్నారు. ఇటీవలే టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైరైన రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ లేదా కేఎల్‌ రాహుల్ కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరికి కెప్టెన్‌గా అనుభవం ఉందని, దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

టీ20లు
జూలై 26
జూలై 27
జూలై 29

ODIలు
ఆగస్టు 1
ఆగస్టు 4
ఆగస్టు 7

Also Read: అంబానీ పెళ్ళిలో సినీ తారల డాన్సులు.. సందడే సందడి..! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు