/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/india-7-jpg.webp)
ICC Rankings: ఆసియా కప్ టోర్నీలో అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్న భారత జట్టు (Indian Team) ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపింది. చిరకాల ప్రతర్ధి పాకిస్తాన్‌ను (Pakistan) ఘోరంగా ఓడించిన రోహిత్ సేన ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసి వన్డే ర్యాంకింగ్స్‌లోనూ పాక్‌ను వెనక్కి నెట్టేసింది. సౌతాఫ్రికాపై అదరగొట్టిన ఆస్ట్రేలియా (Australia) జట్టు 3,061 పాయింట్లు, 118 రేటింగ్‌తో నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకుంది. ఇక గత వారం మూడో స్థానంలో ఉన్న భారత్ పాకిస్థాన్, శ్రీలంకలపై అద్భుతమైన విజయాలు సాధించడంతో రెండో స్థానానికి ఎగబాకింది. 4,516 పాయింట్లు సాధించి 115 రేటింగ్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇక మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ వరుస ఓటములతో 3,102 పాయింట్లతో 115కు రేటింగ్‌తో మూడో స్థానానికి పడిపోయింది.
ఇక ఆటగాళ్ల జాబితా తీసుకుంటే వన్డేలలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకోగా భారత్ యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెరీర్‌లోనే మొదటిసారిగా రెండో ర్యాంకుకు చేరాడు. టాప్ - 10లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 8వ స్థానంలో, రోహిత్ శర్మ (Rohit Sharma) 9వ స్థానంలో ఉన్నారు. బౌలర్ల జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉండగా భారత్ నుంచి స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఏడో స్థానంలో ఉండగా పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 9వ స్థానం దక్కించుకున్నాడు. అలాగే వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ తొలి ర్యాంకులో ఉండగా భారత్ నుంచి మాత్రం హార్ధిక్ పాండ్యా ఆరో స్థానంలో నిలిచాడు.
India stars have enjoyed jumps in the latest @MRFWorldwide ICC Men's ODI Player Rankings 📈
More 👇https://t.co/JXYWqTcFWQ
— ICC (@ICC) September 14, 2023
వన్డే ఫార్మాట్‌లోనే మిగిలిన రెండు ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోంది. టెస్టులలో నెంబర్ వన్ టీమ్‌గా భారత్ ఉంది. 118 రేటింగ్ పాయింట్లతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా టాప్ - 5లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. ఇక టెస్టు బౌలర్లలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా 2, జస్ప్రీత్ బుమ్రా 10వ ర్యాంకుల్లో ఉన్నారు. టెస్టుల ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఫస్ట్, అశ్విన్ సెకండ్ ర్యాంకుల్లో ఉన్నారు. అక్షర్ పటేల్ 5వ ర్యాంకులో నిలిచాడు. అంతేకాకుండా టీ20లలో కూడా 264 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా