Kathua Terrorist Attack: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన భారత్‌.. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

New Update
Kathua Terrorist Attack: కథువా ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం : భారత్

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారత సైన్యానికి చెందిన కాన్వాయ్‌పై సోమవారం ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచెడి-కిండ్లీ రోడ్డు మార్గంలో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తాజాగా ఈ ఘటనపై భారత్‌ స్పందించింది. కథువా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్‌ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి నిస్వార్థ సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదని.. ఈ దాడి వెనుక ఉన్న దృష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదని ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు.

Also Read: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి

ఇదిలాఉండగా.. కథువాలో ఉగ్రవాదులు ప్లాన్‌ ప్రకారం దాడులకు పాల్పడ్డారు. ముందుగా ఆర్మీ కాన్వాయ్‌పై గ్రనైడ్ విసిరారు. ఆ వాహనం ఆగిపోవడంతో వెంటనే కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ అధికారితో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో పదిమంది వరకు సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించిన తర్వాత ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది.

Also Read: దేశంలోని చిన్న వ్యాపారులు కేంద్ర బడ్జెట్ నుంచి కోరేదేమిటి? MSME రంగ డిమాండ్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు