Mascow: మాస్కో ఉగ్ర ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని మోదీ!

మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు

PM Modi : ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు!
New Update

PM Modi Condemns Moscow Terror Attack: రష్యాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో సుమారు 70 మంది మరణించారు..అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రష్యా రాజధాని మాస్కో క్రోకస్‌ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్‌ హాలు పై ముష్కురులు కాల్పులు, బాంబులు దాడులు చేయడంతో 70 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. 150 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడిని శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ట్విటర్ వేదికగా ఆయన "మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నాయి" అని ప్రధాని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు."ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అధికారంపై తన పట్టును పదిలం చేసుకున్న కొద్ది రోజులకే దుండగులు శుక్రవారం మాస్కోలోని కచేరీ హాలులోకి చొరబడి గుంపుపై కాల్పులు జరిపారు, 70 మందికి పైగా మరణించారు, వందల మంది గాయపడ్డారు. అంతేకాకుండా కార్యక్రమం జరుగుతున్న వేదికకు నిప్పు పెట్టారు. దీంతో హాల్‌ పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరికొందరు మరణించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న మాస్కో (Moscow) .. కాల్పులతో ఒక్కసారిగా యుద్ద వాతావరణంలా మారింది. ఐదుగురు దుండగులు కూడా మిలటరీ దుస్తుల్లో ఉండడంతో పాటు హాల్‌ వద్దకు రావడంతోనే కాల్పులు ప్రారంభించారని ఆ తర్వాత హాలులోకి వచ్చి గ్రైరేడ్లను కూడా విసిరినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా కూడా ప్రాణ భయంతో హాల్ సమీపంలో ని బ్రిడ్జి పై పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

దుండగులు బాంబులు (Bombs) కూడా ప్రయోగించడంతో హాలు అంతా మంటలు వ్యాపించాయి. దాడులు జరిగిన వెంటనే రష్యన్‌ అధికార వర్గాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. కొన్ని టీమ్‌ లు రంగంలోకి దిగి గాయపడిన వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. హాలు వద్దకు 70 అంబులెన్స్‌ లను పంపినట్లు అధికారులు తెలిపారు. మరో పక్క భవనంలో మంటల్లో చిక్కకున్న వారిని కాపాడేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు.

ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సోషల్ మీడియాలో పేర్కొంది.

Also read: నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్‌.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే !

#pm-modi #attack #russia #mascow #moscow-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe