Cricket: జింబాబ్వే పర్యటనలో సీనియర్ ఆటగాళ్ళకు రెస్ట్..తెలుగోడికి చోటు టీ 20 వరల్డ్‌కప్ తర్వాత ఇండియా జింబాబ్వే టూర్ వెళ్ళనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ టీమ్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ లో సీనియర్ ఆటగాళ్లు అందరికీ బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. భారత జట్టు జింబాబ్వేతో మొత్తం 5 టి20 ల సిరీస్ ఆడనుంది. By Manogna alamuru 25 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి zimbabwe Tour: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ బుమ్రాలకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. వరుసగా ఐపీఎల్, టీ20 ప్రపంచకప ఆడిని సీనియర్లు అలసి పోయారు. దీంతో వారికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ భావించింది. అందుకే వరల్డ్‌కప్ తర్వాత జరగనున్న జింబాబ్వే టూర్‌కు అందరూ కుర్రాళ్ళను సెలెక్ట్ చేసింది. జులై 6న ఐదు టీ 20 మొదలవుతుండగా.. జూలై 14న 5వ మ్యాచ్‌తో సీరీస్ ముగుస్తుంది. దీనికోసం ఆడే యువ ఆటగాళ్ళ జట్టుకు శుభ్‌మన్‌గిల్ కె్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ లిస్టులో ఐపీఎల్ లో సత్తా చాటిన తెలుగు ఆటగాడు అభిషేక్ శర్మతోపాటు, పరాగ్ లకు చోటును కల్పించారు. జింబాబ్వేకు వెళ్ళనున్న జట్టు.. శుభమన్ గిల్ (C), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (W), ధృవ్ జురెల్ (W), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే 🚨 NEWS India’s squad for tour of Zimbabwe announced.#TeamIndia | #ZIMvIND — BCCI (@BCCI) June 24, 2024 Squad: Ꮪhubman Gill (Captain), Yashasvi Jaiswal, Ruturaj Gaikwad, Abhishek Sharma, Rinku Singh, Sanju Samson (WK), Dhruv Jurel (WK), Nitish Reddy, Riyan Parag, Washington Sundar, Ravi Bishnoi, Avesh Khan, Khaleel Ahmed, Mukesh Kumar, Tushar Deshpande.#TeamIndia | #ZIMvIND — BCCI (@BCCI) June 24, 2024 Also Read:Telugu MP’s: పంచెకట్టుతో పార్లమెంటుకు ఎంపీలు, తెలుగులో ప్రమాణం #cricket #zimbabwe #t20-series #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి