Cricket : ఈసారైనా గెలిచేనా.. ఈరోజు భారత్-సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలో టీ20, వన్డే సీరీస్ లను గెలుచుకున్న భారత్ టెస్ట్‌ల మీద కూడా కన్నేసింది.

New Update
Cricket : ఈసారైనా గెలిచేనా.. ఈరోజు భారత్-సౌత్ ఆఫ్రికా మొదటి టెస్ట్

India v/s SA : సఫారీ గడ్డ మీద అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకుంటోంది రోహిత్(Rohit) సేన. ఇప్పటివరకు దక్కని విజయాలను సొంతం చేసుకుని ఇండియా తిరిగి రావాలనుకుంటోంది. ఇప్పటికే టీ20, వన్డే సీరీస్ లను దక్కించుకున్న భారత టీమ్ టెస్ట్ సీరీస్ లను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 1992 నుంచి టెస్ట్ లలో గెలుపుకోసం టీమ్ ఇండియా(Team India) దండయాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటివరకు గెలుపు మాత్రం దక్కలేదు. ప్రపంచంలో మిగతా అన్ని చోట్లా టెస్ట్ సీరీస్ లు గెలుచుకున్న భారత జట్టు ఇక్కడ మాత్రం నెగుగకురాలేకపోతోంది. ఇప్పుడు రోహిత్ అండ్ టీమ్ మాత్రం దీన్ని సాధిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. లాస్ట్ రెండు సార్లు సీరీస్ కైవసం చేసుకునేందుకు దగ్గరగా వచ్చినా అవ్వలేదని...ఇప్పుడున్న టీమ్ కు ఆ అవకాశం చాలా ఎక్కువగా ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ చెబుతున్నాడు.

Also read : హమ్మయ్య ఫ్రాన్స్ నుంచి వాళ్ళు వచ్చేశారు..25 మంది మాత్రం ఇంకా అక్కడే

తమ జట్టు స్ట్రాంగ్ ఉందనే అంటున్నాడు కెప్టెన్ రోహిత్. షమీ లేకపోవడం లోటే కానీ కానీ కొత్త బౌలర్లు రాణిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అతని స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణ ఆడే అవకాశముంది. నెట్స్‌లో ముకేశ్‌ మెరుగ్గానే కనిపించినా అధిక బౌన్స్‌ రాబట్టే నైపుణ్యంతో ప్రసిద్ధ్‌ టెస్టు అరంగేట్రం చేయడం ఖాయమే. దాంతో పాటూ కీపర్ గా రాహుల్ రాణిస్తాడని చెబుతున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడే కేఎల్‌ రాహుల్‌(KL Rahul) జట్టు అవసరాల కోసం వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా మారి మిడిలార్డర్‌కు వెళ్లాడు. ఇక శుభ్ మన్ గిల్ స్థానంలో యశస్వి ఆడనున్నాడు. శుబ్ మన్ గిల్ మూడో స్థానంలో రానున్నాడు. రోహిత్‌, యశస్వి కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నారు. విండీస్‌లో టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యశస్వికి ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురు కానుంది. ఉప ఖండం పిచ్‌లపై రాణిస్తున్న శుభ్‌మన్‌, శ్రేయస్‌కూ ఇది నిజమైన టెస్టు. ముఖ్యంగా షార్ట్‌పిచ్‌ బంతిని ఎదుర్కోవడం బలహీనతగా ఉన్న శ్రేయస్‌కు ఈ సిరీస్‌ కఠిన సవాలు విసరనుంది. టెస్టుల్లో తొలిసారి వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్న రాహుల్‌పై అందరి దృష్టి ఉంది.

మరోవైపు వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు బలంగానే ఉంది. ఎల్గర్‌.. కెప్టెన్‌ బవుమా, వన్డే సిరీస్‌లో సత్తాచాటిన టోనీ డి జోర్జీ, మార్‌క్రమ్‌, గత టెస్టు సిరీస్‌లో భారత్‌పై రాణించిన కీగన్‌ పీటర్సన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. ఇక రబాడ, ఎంగిడి, కొయెట్జీ, జాన్సన్‌ లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది.

ఇక మొదటి టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సూపర్‌స్పోర్ట్ పార్క్ క్యూరేటర్ బ్రయాన్ బ్లాయ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా మొదటి రోజు ఆట జరగడం చాలా కష్టమని అన్నారు. ప్రారంభ రోజు మూడు సెషన్‌లు వాష్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)...

భారత్‌ : రోహిత్‌, యశస్వి, శుభ్‌మన్‌, కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌, జడేజా, శార్దూల్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌, సిరాజ్‌.

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌, మార్‌క్రమ్‌, జోర్జి, బవుమా, బెడింగ్‌హమ్‌/కీగన్‌ పీటర్సన్‌, వెరెనీ (వికెట్‌ కీపర్‌), మార్కో జాన్సన్‌, కేశవ్‌ మహరాజ్‌, కొయెట్జీ, రబాడ, ఎంగిడి.

Advertisment
తాజా కథనాలు