Grammy Awards : గ్రామీ అవార్డుల్లో శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సెన్ జయకేతనం..

సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో శంకర్‌ మహదేవన్, జాకిర్ హుస్సెన్‌లు జయకేతనం ఎగరవేశారు. వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్‌' ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌ అవార్డును దక్కించుకుంది.

New Update
Grammy Awards : గ్రామీ అవార్డుల్లో శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సెన్ జయకేతనం..

America : సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు(Grammy Awards) ల ప్రధానోత్సవం అమెరికా(America) లోని లాస్‌ ఏంజిల్స్‌(Los Angeles) లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన వివిధ సినీ ప్రముఖులు పాల్గొని తమ పాటలతో అలరించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు చెందిన సంగీత కళాకారులు శంకర్‌ మహదేవన్, జాకిర్ హుస్సెన్‌లు కూడా విజయకేతనం ఎగరవేశారు. వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్‌' ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌ అవార్డును దక్కించుకుంది.

Also Read : శ్రీదేవి డెత్‌పై ఫేక్‌ పత్రాలు చూపించారు: సీబీఐ

ఈ పాటను శంకర్‌ మహదేవన్‌(Shankar Mahadevan) (సింగర్‌), జాకిర్‌ హుస్సేన్‌(Zakir Hussain) (తబలా), గణేశ్‌ రాజగోపాలన్‌(Ganesh Rajagopalan) (వయోలిన్‌), జాన్‌ మెక్‌లాఫ్లిన్‌ (గిటార్‌) వంటి ప్రతిభావంచులైన ఎనిమదిమంది 'శక్తి' బ్యాండ్ పేరిట కంపోజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ పోటీని ఎదుర్కొని 'శక్తి' గెలవడంతో.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గ్రామీ అవార్టు వచ్చిన సందర్భంగా శంకర్‌ మహదేవన్ మాట్లాడారు. ప్రతి విషయంలో నాకు ఎంతో ప్రోత్సాహం అందించిన నా భార్యకు ఈ అవార్డును అంకితం చేస్తున్నానని చెప్పారు. అలాగే ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాననంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Also Read : పెళ్లిగురించి హింట్స్ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్…లేటెస్ట్ పోస్టులో అర్థం అదేనేమో?

Advertisment
తాజా కథనాలు