India: యుద్ధ వాతావరణంలో నష్టపోయిన పాలస్తీనియన్లు.. భారత్ మానవతా సాయం..

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ దేశ ప్రజల్ని ఆదుకునేందుకు భారత్‌ ముందుకొచ్చింది. విపత్తు సహాయ సామాగ్రిని అలాగే ఔషధలాను ఆదివారం గాజాకు తరలించింది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, శానిటరీ యుటిలిటీస్‌, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటుగా ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ 'ఎక్స్‌' లో వెల్లడించారు.

India: యుద్ధ వాతావరణంలో నష్టపోయిన పాలస్తీనియన్లు.. భారత్ మానవతా సాయం..
New Update

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకోసం ఆ దేశ ప్రజలను ఆదుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది. విపత్తు సహాయ సామాగ్రిని అలాగే ఔషధలాను ఆదివారం గాజాకు తరలించింది. అలాగే ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, శానిటరీ యుటిలిటీస్‌, నీటి శుద్ధీకరణ మాత్రలు సహా ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ 'ఎక్స్‌' లో పేర్కొన్నారు.

ఇక భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్‌ సీ-17 విమానంలో మొత్తంగా 6.5 టన్నుల సామగ్రి పాలస్తీనాకు వెళ్తోందని తెలిపారు. అయితే ఈ సామగ్రిని తొలుత ఈజిప్టులోని ఈఎల్-అరిష్‌ విమానాశ్రయానికి తీసుకెళ్తారు. అనంతంరం రఫా సరిహద్దు మీదుగా గాజాకు తీసుకెళ్తారు. అయితే ప్రస్తుతం గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. దీనివల్ల పలు దేశాలు పంపించే మానవతా సాయం వేగంగా పాలస్తీనా పౌరులకు చేరడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా.. 3 రోజుల క్రితంమే ప్రధాని నరేంద్రమోదీ పాలస్తీనియన్‌ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో మాట్లాడారు. గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై సంతాపం తెలిపారు. ఇక ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ పాలస్తీనా ప్రజలకు ఇండియా మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు ప్రధాని. అయితే ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, హింసాత్మక ఘటనలు, అలాగే క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశామని.. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇండియా అనుసరిస్తున్న దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

#palestine #hamas-vs-israel #hamas-israel-news #palastina
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe