Corona: కరోనా డేంజర్ బెల్స్ ..పెరుగుతున్న మరణాల సంఖ్య

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 761 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకన్నా భయపెట్టే విషయం ఒక్కరోజులోనే 12 మంది మరణించడం.

New Update
Corona: కరోనా డేంజర్ బెల్స్ ..పెరుగుతున్న మరణాల సంఖ్య

Covid Active Cases:ఇండియాలో కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రెండేళ్ళపాటూ ప్రపంచాన్ని వణికించిన కరోనా (Coronavirus) మరోసారి తన కోరలను చాస్తోంది. గతకొన్ని రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటూ మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. లాస్ట్ 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. దాంతో పాటూ 12 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ (Central Health Department) బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4, 423కు చేరుకుంది.

ఎక్కడెక్కడ ఎంతమంది?

అన్ని రాష్ట్రాల్లో కంటే కేరళలో (Kerala) అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు కేరళలో ఉన్నాయి. ఇక్కడ 1, 240 యాక్టివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. దీని తర్వాత మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్‌- ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) 128 చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక కోవిడ్‌తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు.

డిసెంబర్ నుంచి...

గత ఏడాది డిసెంబర్ నుంచి కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. మొదట్లో తక్కువగానే కేసులు నమోదయినా తర్వాత పెరుగుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కొత్త వేరియంట్ జేఎన్ 1 (JN.1) వ్యాప్తి చెందుతోంది. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. అయితే కొత్త వేరియంట్‌ తో భయపడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

విదేశాల్లో కూడా..

విదేశాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యూఎస్ఏలో నాలుగు రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి చేశాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ , మసాచుసెట్స్‌లో మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. ఆసప్తరులకు వచ్చే వారు అయితే కచ్చితంగా మాస్కులు ధరించాల్సిందేనని అంటున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 17 నుండి 23 వరకు US అంతటా కోవిడ్ నుండి 29,000 కంటే ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు సింగపూర్‌లో మాత్రం వైరస్ వ్యాప్తి తగ్గిందని అక్కడి అధికారులుచెబుతున్నారు. ఐసీయూలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. గత వారం కంటే ముందు వారంలో 864 మంది రోగులు ఆసుపత్రుల్లో చేరగా, గత వారంలో వారి సంఖ్య దాదాపు సగానికి (496) పడిపోయింది. ఇక చైనాలో కూడా కరోనా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది. లూనార్ సెలవుల తర్వాత చైనాకు వచ్చేవారితో ఇది మరింత ఎక్కువ అవుతోందని అంచనా వేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు