ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్‌కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. కొలంబో వేదికగా రేపు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కానీ రేపు కొలంబోలో వర్షం పడే అవకాశం అధికంగా ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10న కొలంబోలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపిన అధికారులు.. సాయంత్రం సమయంలో మాత్రం వర్షం ఖచ్చితంగా కురుస్తుందని స్పష్టం చేశారు.
కాగా రేపు జరిగే భారత్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే తెలపడంతో ఏసీసీ ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించింది. మ్యాచ్ మధ్యలో వర్షం కురిస్తే మ్యాచ్ ఏ ఓవర్లో ఆగిపోయిందో.. మరోసటి రోజు అదే ఓవర్ నుంచి ప్రారంభం అవుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. భారత్-పాక్ టీమ్‌లు 2005 నుంచి నేటి వరకు దైపాక్షిక సిరీస్‌లో పాల్గొనేదు. ఇరు జట్లు ఎప్పుడూ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్‌లా మారింది. అందుకే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డేను కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా రేపు జరుగబోయే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవద్దని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
మరోవైపు ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాక్ టీమ్‌లు తలపడగా.. భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. 15 ఓవర్లలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా అటాకింగ్‌కి దిగారు. పోటిపడి బౌండరీలు దాటడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 150 లోపే ఆలౌట్ అని అంతా భావించగా.. ఈ ఇద్దరి పార్టనర్‌షిప్ వల్ల 200 పరుగుల మార్క్‌ని దాటింది. 81 బంతుల్లో 82 పరుగులు చేసిన ఇషాన్‌కిషన్‌ని హారీస్ రౌఫ్ విడదీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 266 పరుగులు చేసింది.