India-Maldives : భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ..

కొన్ని రోజులుగా ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులూ భేటీ అయ్యారు. రెండు దేశాల దౌత్య సంబంధాల మీద చర్చించారు. ఇందులో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు.

India-Maldives : భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ..
New Update

NAM Summit : ఉగాండా(Uganda) రాజధాని కంపాలాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల(Maldives) విదేశాంగ మంత్రి మూసా జమీర్ భేటీ అయ్యారు. కొంతకాలంగా రెండు దేశాల మధ్య గొడవ నడుస్తున్న కారణంగా ఈరోజు ఇద్దరు మంత్రుల భేటీ కీలక పరిణామంగా మారింది. ఇందులో వీరిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద చర్చించినట్లు తెలుస్తోంది. నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్(NAM) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు నేతలు కంపాలాకు వెళ్లారు. ఈరోజు నుంచే నామ్ సమావేశాలు జరగనున్నాయి. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో జరిగిన భేటీలో భారత్(India)-మాల్దీవుల సంబంధాలపై వివరంగా చర్చించుకున్నామని అని జైశంకర్ తెలిపారు. నామ్ (NAM) సంబంధిత అంశాలను కూడా చర్చించామన్నారు.

Also Read:హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి

మాల్దీవుల సహకారం ఎప్పుడూ ఉంటుంది...

భారతదేశ సహకారం మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్ స్పష్టం చేశారు. జైశంకర్‌ను కలవడం సంతోషంగా ఉందని జమీర్ అన్నారు. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, మాల్దీవులలో కొనసాగుతున్న డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, సార్క్, నామ్‌ల సహకారం మీద చర్చించుకున్నామని తెలిపారు. సార్క్, నామ్‌లను బలోపేతం చేయడానికి మాల్దీవుల సహకారం ఎప్పుడూ ఉంటుందని జమీర్ హామీ ఇచ్చారు.

Also Read : ఆయన ఆకాశం..ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది..బాలయ్యకు యార్లగడ్డ చురకలు!

భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్న అధ్యక్షుడు...

అంతకు ముందు గత ఏడాది అక్టోబర్‌లో మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం వెంటనే మాల్దీదువులను వీడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని కోసం భారత్‌తో చర్చలు ప్రారంభించామని తెలిపారు. వాస్తవానికి మాల్దీవుల్లో ఇండియన్ ఆర్మీ(Indian Army) ఉనికికి వ్యతిరేకంగా మొహమ్మద్ మయిజ్జు పార్టీ ప్రచారం చేసి గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం ఈ విషయంపై మాట్లాడారు. తమ దేశం నుంచి భారత సైన్యం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు దీని మీద కూడా భారత, మాల్దీవుల విదేశాంగ మంత్రులు చర్చించినట్టు చెబుతున్నారు.

మాల్దీవుల వివాదం...

భారత ప్రధాని మోడీ(PM Modi) రీసెంట్‌గా లక్షద్వీప్‌(Lakshadweep) లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. వీటినచూసి చాలా మంది నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు బొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇలాంటి మాటలతోనే పోస్ట్‌లు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్‌ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్‌ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్‌ రమీజ్‌ కూడా నోరు పారేసుకున్నారు. ఇది చాలా కాంట్రవర్షియల్ గా మారింది. ఈ ఇష్యూ ఇరు దేవాల మధ్య సంబంధాలను బలహీన పర్చింది. ఇండియాలో అయితే బాయ్ కాట్ మాల్దీవులు(#BoycottMaldives) అన్న హ్యాట్ ట్యాగ్ కూడా నడిచింది. చాలా మంది తమ మాల్దీవుల ట్రిప్‌ను కాన్సిల్ చేసుకున్నారు.

#india #maldives #foreign-ministers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe