Asia Cup 2023: భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భారత్‌ ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది.

New Update
Asia Cup 2023: భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భారత్‌ ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక భారత్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగారు. మొదట బుమ్రా ఫస్ట్‌ వికెట్‌ తీయగా.. అనంతరం మహ్మద్‌ సిరాజ్‌ ఓకే ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. ఓదశలో మెండీస్‌ ఆదుకుంటాడని చూసినా హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను కూడా వెనుదిరిగాడు. అనంతరం లంక తన చివరి మూడు వికెట్లను సైతం తర్వత్వరగా కోల్సోయింది. దీంతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్ప కూలింది.

అనంతరం 51 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రతీబంతిని బౌండరీకి తరలించాలనే కసితో ఆడారు. 6.1 ఓవర్లో భారత్‌ 51 పరుగులు చేసి లక్ష్యన్ని చేధించింది. మరోవైపు ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగ సాగుతుందని అభిమానులు భావించగా.. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టడంతో అభిమానులు మజాను మిస్సయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 250వ వన్డే మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌ విజయంతో తన 250వ వన్డే మ్యాచ్‌ను విజయంతో ముగించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో హీరో ఎవరంటే హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అనే చెప్పాలి. బుమ్రాను చూసి బయటపడ్డ లంక బౌలర్లను సిరాజ్‌ కళ్లెం వేస్తాడని ఏవరూ అనుకోలేదు. మూడో ఓవర్‌లో బుమ్రా ఓపెనర్‌ వికెట్‌ తీయగా అనంతరం బాల్‌ అందుకున్న సిరాజ్‌.. తాను వేసిన 4వ ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టగాడు. ఇందులో నాలుగో ఓవర్‌లోని 3, 4 బంతుల్లో వరుస వికెట్లు తీయడం గమనార్హం. దీంతో లంక నాలుగో ఓవర్‌లోనే కీలక బ్యాటర్లును కోల్పొయింది. అంతే కాకుండా సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ గణాంకాలు 6/21 నెలకొల్పాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు