Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా.. ఇండియా కూటమి మెగా మార్చ్‌ చేయనుంది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన అరెస్టుకు నిరసనగా.. ఇండియా కూటమి మెగా మార్చ్‌ చేసేందుకు రెడీ అయిపోయింది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. విపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఢిల్లీలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాయి. తాము చేపట్టబోయేది రాజకీయ సభ కాదని ఆప్ స్పష్టం చేసింది.

Also Read: దారుణం.. మొబైల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి

రాజకీయ పార్టీ నేతలను బెదిరించడంతో పాటు.. విపక్షాలు అడ్డు లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం.. సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ అన్నారు. ఝార్ఖండ్‌లో కూడా హేమంత్‌ సోరెన్‌, బిహార్‌లో తేజస్వీ యాదవ్‌లపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. అలాగే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను గృహ నిర్బంధం చేసి.. ఆఖరికి ఆప్ కార్యాలయన్ని కూడా సీజ్‌ చేశారని మండిపడ్డారు.

సీఎంలను అరెస్టు చేయడం, రాజకీయ పార్టీల ఖాతాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యమా అని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్లీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలపై విపక్ష పార్టీలన్ని కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ ఆదివారం జైలు నుంచే తన పాలనను మొదలుపెట్టారు. ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి.

Also Read: ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా?

Advertisment
తాజా కథనాలు