రెండో టీ20లో ఈ యువ సంచలనానికి ఛాన్స్‌ ఇస్తారా? అలా ఆడితే మాత్రం కష్టమే భయ్యా!

విండీస్‌తో రెండో టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోని రెండో ఫైట్‌లో గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఫస్ట్ మ్యాచ్‌ విక్టరీనే రిపీట్ చేయాలని విండీస్‌ భావిస్తోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్ కోడ్, డీడీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

రెండో టీ20లో ఈ యువ సంచలనానికి ఛాన్స్‌ ఇస్తారా? అలా ఆడితే మాత్రం కష్టమే భయ్యా!
New Update

రెండో టీ20కి టైమ్‌ దగ్గరపడుతోంది. ఇవాళ రాత్రి 8గంటలకే మ్యాచ్‌ స్టార్ట్ అవుతుంది. మొదటి టీ20లో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఓడిపోయాం. గెలిచే మ్యాచ్‌ చేజేతులా పోగొట్టుకున్నాం. సరే ఐపోయిందేదో ఐపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌లో అవే తప్పులు రిపీట్ చేయకుండా ఉంటే చాలు. టెస్టుల్లో, వన్డేల్లో విండీస్‌(west indies) జట్టు చిన్నదే కావొచ్చు.. ఆఖరికి ఈ ఏడాదికి ప్రపంచకప్‌కి కూడా క్వాలిఫై అవ్వని టీమే కావొచ్చు.. టీ20ల్లో మాత్రం వారిని తక్కువ అంచనా వేస్తే అందుకు తప్పదు భారీ మూల్యం. ఫస్ట్ టీ20లో ఓటమి తర్వాత ఈ విషయం ఇప్పటికే హార్దిక్‌(hardik pandya) సేనకు బోధపడే ఉంటుంది. రెండో టీ20లోనైనా నిర్లక్ష్యంగా వ్యవహారించకుండా ఉంటే మంచిది. ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 లీడ్‌లో ఉంది. అది 2-0గా మార్చాలని రోవ్ మన్ పావెల్ టీమ్‌ భావిస్తుండగా.. 1-1తో సమం చేయాలని హార్దిక్‌ టీమ్‌ ప్లాన్‌ వేసింది.

యశస్వి జైస్వాల్ పరిస్థితి ఏంటి?
ఈ ఏడాది ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్‌(Jaiswal) ఆట మాములుగా లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. బౌలర్‌ ఎంతటివాడైనా ఊచకోత కోసిపడేశాడు. ప్రస్తుతం టీమ్‌తో పాటే యశస్వి ఉన్నా.. తొలి టీ20లో మాత్రం అతనికి ఆడే ఛాన్స్‌ రాలేదు. ఓపెనర్లగా గిల్(gill), ఇషాన్‌(Ishan) ఉండడంతో యశస్వి బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక ఇవాళ కూడా యశస్విని బెంచ్‌కే పరిమితం చేస్తారాని సమాచారం. ఎందుకంటే మొదటి మూడు టీ20లు ఒక జట్టుతో.. మిగిలిన రెండు టీ20లు మార్పులతో బరిలోకి దిగాలన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావనగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో అందరికి ఛాన్స్‌ ఇవ్వాలన్నది వారి ఆలోచన. ఇక ప్రస్తుతం ఇషాన్‌, గిల్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. దీంతో యశస్వి తన ఫస్ట్ టీ20 కోసం మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పని పరిస్థితి. కానీ చివరి నిమిషంలో గిల్‌ స్థానంలో యశస్విని బరిలోకి దింపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

బ్యాటింగ్‌లో రాణించకపోతే అంతే సంగతి:
మరోవైపు తొలి మ్యాచ్‌లో టీమిండియా ఊహించని విధంగా ఓడిపోయింది. 150పరుగుల టార్గెట్‌ని కూడా రీచ్‌ అవ్వలేక చతికిలపడింది. గెలుపు దశ నుంచి అనూహ్యంగా ఓటమి బాట పట్టింది. బ్యాటింగ్‌ వైఫల్యంతోనే పరాజయం పాలైంది. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ మినహా ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సంజూ ఇలా అందరూ ఫెయిల్ అయ్యారు. అటు విండీస్‌ మాత్రం బ్యాటింగ్‌లో తడపడ్డా.. బౌలింగ్‌లో పుంజుకోని విజయం సాధించింది. ఈ పొట్టి ఫార్మెట్‌లో వెస్టిండీస్‌ని తక్కువ అంచనా వేస్తే ఇలాంటి రిజల్ట్‌ ఫేస్‌ చేయక తప్పదని ఇప్పటికే భారత్‌ జట్టుకు అర్థమయ్యే ఉంటుంది.

టీమిండియా తుది జట్టు (అంచనా) :

ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్ష్ దీప్ సింగ్, ముకేశ్ కుమార్

#hardik-pandya #ishan-kishan #yashasvi-jaiswal #shubman-gill #india-vs-west-indies-t20
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe