IND VS SA : భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. కుల్దీప్‌ రికార్డుకు సెల్యూట్‌ కొట్టాల్సిందే!

దక్షిణాఫ్రికాపై మూడో టీ20లో ఐదు వికెట్లతో మెరిసిన టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఓవర్‌సీస్‌లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండుసార్లు ఫైఫర్‌(ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) తీసిన ఏకైక ఇండియా బౌలర్‌గా నిలిచాడు కుల్దీప్‌.

New Update
IND VS SA : భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. కుల్దీప్‌ రికార్డుకు సెల్యూట్‌ కొట్టాల్సిందే!

Kuldeep Record : దక్షిణాఫ్రికా(South Africa)పై జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్నీ విభాగాల్లోనూ రాణించారు. ఇటు బ్యాటింగ్‌ అటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశారు. ముందుగా బ్యాటింగ్ చేశారు భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. భారత్‌ బ్యాటర్లలో సూర్యకుమార్‌యాదవ్‌(Surya Kumar Yadav) సెంచరీతో ఇరగదీశాడు. టీ20ల్లో తాను ఎంత ప్రమాదకర బ్యాటరో ప్రపంచానికి మరోసారి చూపించాడు. దీంతో సూర్యభాయ్‌ పేరు మరోసారి క్రికెట్‌ సర్కిల్స్‌లో మారుమోగిపోతోంది. అయితే టీమిండియా గెలుపులో సూర్య పాత్ర ఎంత ఉందో స్పిన్నర్‌ కుల్దీప్‌(Kuldeep Yadav) పాత్ర కూడా అంతే ఉంది. ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలిందంటే అది కుల్దీప్‌ బౌలింగ్‌ వల్లనే!

ఫైఫర్‌తో మెరిసిన కుల్దీప్‌:
2.5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చిన కుల్దీప్‌(Kuldeep) ఐదు వికెట్లు తీశాడు. అంటే కుల్దీప్‌ వేసింది కేవలం 17 బంతులే.. తీసింది మాత్రం 5 వికెట్లు.. అంటే సగటున 3-4 బంతులకు ఒక వికెట్ తీసినట్టు లెక్క. దక్షిణాఫ్రికను వారి గడ్డపైనే ఇంతలా ఎక్స్‌పోజ్‌ చేయడం చిన్నవిషయం కాదు. కుల్దీప్‌ టాలెంట్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతని బంతులు బొంగరాల్లా.. గింగరాలు తిరుగుతాయి. దక్షిణాఫ్రికా బ్యాటర్లు అందుకే కుల్దీప్‌ ఉచ్చులో పడిపోయారు. వికెట్లు సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా వందలోపే ఆలౌట్ అయ్యింది. దీంతో సిరీస్‌ సమం అయ్యింది.

కుల్దీప్‌ ఖాతాలో రికార్డులు:
దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో 5వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి పడింది. ఓవర్‌సీస్‌లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండుసార్లు ఫైఫర్‌(ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) తీసిన ఏకైక ఇండియా బౌలర్‌గా నిలిచాడు. 2018లో ఇంగ్లండ్‌-మాంచెస్టర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ జట్టుపై ఐదు వికెట్లుతో రాణించాడు. అంతేకాదు ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో కుల్దీప్‌ ఖాతాలో 48 వికెట్లు(దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ముగిసేనాటికి) ఉన్నాయి.

Also Read: సచిన్‌, కోహ్లీ సరసన సూర్యాభాయ్‌.. రికార్డుల జాతర!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు