Hyderabad Crime : రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు

2023 వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్​ పరిధిలో ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయ‌ని తెలిపారు. సైబ‌ర్ నేరాలు 25 శాతం పెరిగితే మ‌హిళ‌ల‌పై 6.65 శాతం అఘయిత్యాలు త‌గ్గినట్లు వెల్లడించారు. మొత్తం 27586 కేసులు నమోదయ్యాయి.

New Update
Hyderabad Crime : రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు

Crime Report : రాచకొండ కమిషనరేట్​(Rachakonda Commissionerate) పరిధిలో 2023 వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు(CP Sudheer Babu) బుధవారం విడుదల చేశారు. 2022తో పోలిస్తే రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయ‌ని తెలిపారు. ముఖ్యంగా సైబ‌ర్ నేరాలు 25 శాతం పెరిగితే మ‌హిళ‌ల‌పై 6.65 శాతం ఆఘయిత్యాలు, నేరాలు త‌గ్గాయ‌ని చెప్పారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తం 27586 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది 6.86 శాతం పెరిగిన నేరాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్(Cyber Crime) నేరాలు25 శాతం పెరిగాయి. 1372 సైబర్ నేరాల కేసులు నమోదు చేశాం. అయితే మహిళలపై అత్యాచారం కేసులు తగ్గిపోయాయి. 420 కిడ్నాప్ కేసులు రిక్టార్డు అయ్యాయి. 66 మర్డర్స్ కేసులు, 59 చైన్ స్నాచ్, దోపిడీలు జరిగాయి. ఇక ఫోక్సో చట్టం కింద 1061 కేసులు బుక్ చేయగా.. 16 డౌరీ డెత్స్ నేరాలు జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే దొంగతనాలకు సంబంధించిన కేసులు 767 ఎఫ్‌ ఐఆర్ చేశామని, 16 వరకట్నం డెత్స్ లెక్కలోకి వచ్చినట్లు వెల్లడించారు. ఇక ఇటీవల సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులు 282 నమోదవగా.. 698మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : New Ration Cards : గుడ్ న్యూస్…జనవరిలో కొత్త రేషన్ కార్డులు…కానీ అంత ఈజీగా ఇవ్వరట..!!

ఇక మాన‌వ అక్రమ ర‌వాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు అయిన‌ట్లు తెలిపారు. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు న‌మోదు కాగా, 972 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖ‌రారు చేశామ‌న్నారు. 20 కేసుల్లో నిందితుల‌కు జీవిత ఖైదు ప‌డిందని సీపీ తెలిపారు. ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసు దర్యాప్తు జరుగుతోందని అన్నారు. మరోవైపు హైదరాబాద్​ కమిషనరేట్​ వార్షిక నేర నివేదికను సీపీ శ్రీనివాస రెడ్డి విడుదల చేశారు. యాక్సిండెట్​లు పెరిగాయని, రేప్​ కేసులు పెరిగాయని వెల్లడించారు. 2022తో పోలిస్తే 2 శాతం నేర కేసులు పెరిగాయని ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు