పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాని వరదలు ముంచెత్తాయి. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జలమయ్యింది. రన్ వే, ట్యాక్సీ వే పైకి భారీగా నీరు చేరింది. ప్రస్తుతానికి విమానాల రాకపోకలు ఆగలేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. కోల్‌కతాతో పాటు హౌరా, సాల్ట్ లేక్, బారక్‌పూర్‌లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వీధుల్లో పలుచోట్లు నడుం లోతు వరకు నీరు చేరింది.
Also Read: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఇప్పటికే వాతావరణశాఖ పురూలియా, ముర్షాదాబాద్, డార్జీలింగ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు జార్ఖండ్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. గిరిడిలోని వరదలో వాహనాలు చిక్కుకున్నాయి. మరికొన్ని చోట్లు రైలు పట్టాలు మునిగిపోయాయి.
Also read: కొండపై చిక్కుకున్న కుటుంబం.. ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూ టీం