ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో డెడ్ బాడీ కళ్లు ఎత్తుకెళ్లిన దిగ్భ్రాంతికరమైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడగా ఆమెను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పిత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన ఇష్యూ మెజిస్ట్రేట్ పరిధిలోకి వెళ్లగా తుది తీర్పు వెలువడాల్సివుంది.
ఇది కూడా చదవండి :Indian Navy Jobs: ఇండియన్ నేవీలో టెన్త్ అర్హతతో జాబ్స్.. మొత్తం 910 ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే!
ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు, అధికారుల వివరాలు ఇలావున్నాయి. బదాయు జిల్లాకు చెందిన ఓ యువతి (20) ఆదివారం ఉరేసుకుని చనిపోయింది. అయితే వరకట్నం కోసం ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. పోస్ట్ మార్టం తర్వాత తమ కూతురు కళ్లు మాయమైనట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం సమయంలోనే కళ్లను తొలగించారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆరోపణలు చేస్తూ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అవయవ అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని ఆరోపిస్తూ.. వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ఇందుకు సంబంధించిన పూర్తి నివేదిక వీలైనంత త్వరగా సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్ తమను ఆదేశించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇందకు సంబంధించిన ఘటనపై దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుండగా చచ్చిన శవాలతోనూ బిజినెస్ చేస్తున్నారంటూ జనాలు వాపోతున్నారు.