Divorce Case : విడాకులకు(Divorce) సంబంధించిన భరణం(Dowry) కేసులో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) సంచలన తీర్పు వెల్లడించింది. ఇటీవల ఓ మహిళా తన భర్త నుంచి విడాకులు కోరుతు ఫిటిషన్ దాఖలు చేయగా శనివారం దీనిపై తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం.. భర్త ఆస్తిపరుడు కాకపోయినా, ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
అదనపు వరకట్నం కోసం..
ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్(UP) చెందిన ఓ జంట 2015లో వివాహం చేసుకోగా.. కొద్ది రోజులకు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అదనపు వరకట్నం కోసం భర్త ఇల్లాలి తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో 2016లో పుట్టింటికి వెళ్లిపోయిన సదరు మహిళా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదం ఫ్యామిలీ కోర్టుకు చేరగా.. వీరిద్దరికీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలోనే విడిపోయిన భార్యకు భరణం కింద నెలకు రూ.2వేలు చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి : Hyderabad: నెలకు రూ.18లక్షల సంపాదన.. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి తెలిస్తే షాకే!
భరణం చెల్లించాల్సిందే..
ఈ క్రమంలోనే నెలవారీ భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అతడు 2023 ఫిబ్రవరి 21న అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య(Wife) ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. అంతేకాకుండా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు కూడా ఆధారపడ్డారని విన్నవించాడు.
కూలీ పనిచేసైనా భరణం చెల్లించాల్సిందే..
అయితే తన భార్య ఉద్యోగం చేసి నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందని కోర్టులో రుజువు చేయలేకపోయాడు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్ రేణు అగర్వాల్(Justice Renu Agarwal).. దీంతో తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. భర్తకు కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని, అలా పనిచేసైనా భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. కూలీగా రోజుకు కనీసం రూ.300 నుంచి రూ.400 సంపాదించే వీలుందంటూ అతని రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది.