Ration Card Update : తెలంగాణ(Telangana) లో పేదలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ తీపికబురు చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు షురూ చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం మంత్రి కొత్త రేషర్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనున్నారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్(Congress) సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలుకు ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని అంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు నెంబర్ తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డు కూడా తప్పనిసరి. దీంతో తెలంగాణలో్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం పలు కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాయి.
కాగా 2014 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఇప్పటికి తొమ్మిదేళ్లు అవుతోంది. దీంతో రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొంతమంది తమ పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారికి రేషన్ కార్డులు ఇప్పటివరకులేవు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 1.25లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయి. రాష్ట్రంలో ఉన్న 90.14లక్షల రేషన్ కార్డులు ఉండగా..వీటిలో అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.62లక్షల కార్డులు ఉన్నాయి. అన్నపూర్ణ పథకం కింద 5,21 కార్డులు ఉన్నాయి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ. 2,500ఇవ్వాలన్నా కూడా రూ. 10లక్షల ఆరోగ్రశ్రీ బీమా పథకాలు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా పథకం అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్నవారితోపాటు కొత్త దరఖాస్తులకు కూడా అవకాశం కల్పిస్తారని ప్రజలు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ తెలంగాణలోకి ఆమ్రాపాలి ఐఏఎస్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్?