Srisailam SLBC: దశాబ్దాల కల..ఎస్ఎల్బిసి పనులు త్వరగా పూర్తి చేయాలి:ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.