Life style:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్

చలికాలం వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలనుకుంటున్నారా...వారిలో ఇమ్యునిటీ పెరిగి బలంగా తయారవ్వాలనుకుంటున్నారా...అయితే నట్స్ మిల్క్ ను వారి చేత తాగించాల్సిందే. దీని వల్ల వారు హుషారుగా కూడా ఉంటారు.

Life style:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్
New Update

చలికాలం స్టార్ట్‌ అయితే.. జలుబు సీజన్‌ మొదలైనట్టే. ముఖ్యంగా చిన్నపిల్లలను జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఎక్కువగా ఎటాక్‌ చేస్తాయి. పెద్దవారితో పోలిస్తే వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీంతో వైరస్‌లు వారిపై త్వరగా దాడి చేస్తాయి. అందుకే వారిలో ఇమ్యునిటీని పెంచాలి. పిల్లల్లో ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌ ఉంటే.. వ్యాధులు వారి దరిచేరవు. ఒకవేళ జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినా.. వాటిని తట్టుకుని త్వరగా బయటపడే శక్తి వారికి ఉంటుంది. దీని కోసం ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన డ్రింక్ ఉంది. అది తాగితే జబ్బులు, వ్యాధులు పిల్లల దగ్గరకు రమ్మన్నా రావు.

Also Read:వాహ్ సూపర్ టైటిల్..మణిరత్నం-కమల్ మూవీ పేరు థగ్ లైఫ్

ఇది రోజూ పిల్లలకు ఇస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వారి ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, సీజనల్‌ మార్పుల కారణంగా వచ్చే సమస్యలను రక్షిస్తుంది. ఇది తయారు చేయడమూ చాలా సులభం. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. అయితే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. దీని కోసం మూడు రకాల నట్స్ ను తీసుకోవాలి. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాలను తీసుకుని మిక్సీ చేసుకోవాలి. మరీ మొత్తగా చేసుకోవక్కర్లేదు. ఆ తర్వాత వాటిలో యాలకుల పొడి, జాజికాయ పొడి మిక్స్‌ చేయాలి. ఈ పొడిని ఒక‌ టైట్‌ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి.

ఒక గ్లాస్‌ పాలు తీసుకుని మరిగించాలి. పాలు మరిగిన తర్వాత దానిలో సరిపడా పంచదార వేసి, ఈ పొడిని కూడా యాడ్‌ చేయండి. దానిలో కుంకుమ పువ్వు, వాల్‌నట్స్‌ వేసి.. టేస్టీ.. టేస్టీగా ఉండే పాలను పిల్లలకు ఇవ్వండి. నట్స్, స్పైసెస్ వల్ల ఈ మిల్్క్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తాగుతారు.

నట్స్ పిల్లలకి బలాన్ని ఇస్తాయి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. యాలకులు, కుంకుమపువ్వు సువాసనతో.. పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడతారు. వాల్‌నట్స్‌, జాజికాయ, యాలకులు, డ్రై ఫ్రూట్స్‌లో పొటాషియం, విటమిన్లు, జింక్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎదుగుతున్న పిల్లలకు చాలా అవసరం. అంతేకాదు శీతాకాలం పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌ చేర్చడానికి ఇదొక మంచి మార్గం.

#health #milk #immunity #nuts #winter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe