Telangana Weather Updates: ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ(Telangana) జనాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ(IMD). రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఇప్పటిఏ హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట,చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, హైటెక్ సిటీ, మల్కాజిగిరి, ఉప్పల్, లకిడికపూల్, అబిడ్స్, గోషామహల్, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు.
Also Read:
AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం!
Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా