Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

తెలంగాణలో జులై 12 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
New Update

తెలంగాణలో ఆదివారం నుంచి జులై 12 వరకు వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు వరంగల్‌, హన్మకొండ, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి వికారాబాద్‌ నిర్మల్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read: మణికొండ డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు

#weather-alert #telugu-news #hevay-rains #imd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe