దేశంలో గత కొన్నిరోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల ఎండల తీవ్రత ఉండగా.. మరికొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు తెలికపాటి వానలు కురుస్తాయని చెప్పింది.
Also Read: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!
ఇదిలాఉండగా.. మరోవైపు కేరళ, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, తమిళనాడులో జోరుగా వానలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోతున్నాయి. ఇప్పటికో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: ఏపీలో 78.36 శాతం పోలింగ్